మేం రాజీనామాలు చేస్తాం.. వైసీపీ 22 మంది ఎంపీలు సిద్ధమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సవాల్ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలాగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టిన రామ్మోహన్‌నాయుడు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేయడానికైనా మేం సిద్ధం.. దీనిపై వైసీపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందన్నారు.. మరి మేం రాజీనామాలు చేస్తాం… వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు సిద్ధమా? అని ప్రశ్నించారు.
వైసీపీ ఎంపీలు ఈ రెండేళ్లు ఏంచేశారు… ఇప్పుడే ఎందుకు నిద్ర లేచారు? అని ప్రశ్నించారు రామ్మోహన్ నాయుడు.. ఎంపీ రఘురామకృష్ణరాజు పై అనర్హత వేటు వేయించడానికి డ్రామా ఆడుతున్నారన్న ఆయన.. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటమేంటో… మమ్మల్ని ఏం సాయం అడిగారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల విమర్శలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న ఆయన.. మేం పార్లమెంట్‌లో చేస్తున్న పోరాటమేంటో ప్రజలే గమనిస్తున్నారని.. నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ పైనే ఉందన్నారు.
Also Read
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!