ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాక కూడా వైసీపీ నేతలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారని అన్నారు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు అయింది.అడిగిన వెంటనే లోకేష్ ఓకే చెప్పారు.. భుజం తట్టారు.అభ్యర్థిత్వాలని అధికారికంగా ఖరారు చేశాక.. లోకేష్ నిరంతరం రివ్యూ చేశారు.ఓటరు నమోదు విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి గెలిచాను.కర్నూల్లో హైకోర్టును వ్యతిరేకిస్తున్న టీడీపీకి ఓటేయొద్దన్నారు.. దాన్ని ఎదుర్కొన్నాం.. ప్రతి ఒక్కరికీ వివరించాం అన్నారు. ధనుంజయ్ రెడ్డి అనే కార్యకర్త పోలీసులు కొడుతున్నా లెక్కచేయకుండా పార్టీ కోసం పనిచేశాడన్నారు రామగోపాల్ రెడ్డి.
Read Also: Today Stock Market Roundup 20-03-23: మార్కెట్‌కి ‘ఉక్రెయిన్’ ఊరట
జగన్ అరాచకాలపై అనుభవం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరించాం.ముఖ్య నేతలను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లుగా పెట్టాం.తలలు తెగిపడ్డా వెనక్కు తగ్గొద్దు.. భయపడొద్దని కౌంటింగ్ సందర్భంగా టీడీపీ ఏజెంట్లకు చెప్పాను.అవసరమైతే ప్రతిదాడులకూ సిద్దపడ్డాం.టీడీపీ ఏజెంట్ల మీద దాడి చేస్తే.. టీడీపీ వాళ్లనే కొట్టుకుంటూ పోలీసులు అరెస్టు చేశారు.వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి వచ్చి అభినందనలు తెలిపారు.. ఆ తర్వాత అరగంటకే వచ్చి ఆందోళన చేశారు.డిక్లరేషన్ ఫారం ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టారన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల సహకారంతో విజయం సాధించామన్నారు. ఎన్నికల్లో అడుగడుగునా ఎన్నో ఆటంకాలు ఎదురైనా చివరాఖరుకు ధర్మం గెలిచిందన్నారు.జగన్ స్వంత జిల్లాతో పాటు పశ్చిమరాయలసీమలో టీడీపీకి ఓటర్లు బ్రహ్మరథం పట్టడం రాబోయే మార్పులకు నిదర్శనం అన్నారు రామగోపాల్ రెడ్డి.