అమరావతి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో కొత్త ఎమ్మెల్సీలకు అభినందన సభ జరిగింది. అభినందన సభకు హాజరయ్యారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ముగ్గురిది.. ఒక్కో కష్టం. డబ్బు లేనిదే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదన్న పరిస్థితికి చంద్రబాబు, కొత్త ఎమ్మెల్సీలు చరమ గీతం పాడారన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. బాబాయిని గొడ్డలిపోటుతో చంపేశాక ప్రజలు భయపడుతున్నారు.ఓటు అడగడానికి రావొద్దు.. మీకే ఓటేస్తామని వేపాడ చెప్పిన విషయం నిజం. ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తంగా ఉంది.
Read Also: Minister KTR: రైతుల వెన్నంటే ఉండాలి.. వారికి భరోసా కల్పించాలి
వేపాడకు ఎకనమిస్టుగా మంచి పేరు ఉంది.మంచి పేరు ఉంది కాబట్టే వేపాడ ఎమ్మెల్సీగా గెలిచారు.వేపాడ విశ్వసనీయతే గెలిపించింది.వేపాడ పేరు ప్రకటించి వెంటనే పార్టీ గెలిచిందనే ఫీలింగ్ వచ్చేసింది.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు శ్రీకాంత్ అండగా నిలిచారు.వేపాడ, శ్రీకాంత్, రాంగోపాల్ రెడ్డి భార్యలు వారి గెలుపు కోసం కష్టపడ్డారు.శ్రీకాంత్ టెక్నాలజీని కూడా బాగా వినియోగించుకున్నారు.. ఎమ్మెల్సీగా గెలిచారు.రాంగోపాల్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే ముందు నేనూ ఆలోచించాను.పులివెందుల బిడ్డ రాంగోపాల్ రెడ్డి. రాంగోపాల్ రెడ్డి పులివెందుల పులి.. జగన్ పులివెందుల పిల్లి.పులివెందుల్లో వైసీపీ రౌడీయిజాన్ని రాంగోపాల్ రెడ్డి అడ్డుకున్నారు.జగన్ పిరికివాడు.తన కోసం చాలా మందిని తన క్రైమ్ లో పార్టనర్లను చేస్తారు.
టీడీపీ గెలిచిన తర్వాత సీఎం జగన్ ఆదేశాల మేరకు రీ కౌంటింగ్ కోసం డిమాండ్ చేశారు.ఎన్నికల ఫలితాలు ప్రకటించాకే రీ-కౌంటింగ్ డిమాండ్ చేశారు.. డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదు.రాత్రంతా మానిటర్ చేస్తూ డిక్లరేషన్ ఫారం కోసం ఒత్తిడి చేశాం.మన ఎఫర్ట్సుతోనే వాళ్లకి ఇష్టం లేకున్నా డిక్లరేషన్ ఫారం ఇచ్చారు.గెలిచిన ఎమ్మెల్సీని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు.ఆర్వోను రెచ్చగొట్టిన సీఎంను ఏమనాలి..?రేపు ఏదైనా తేడా జరిగితే.. బాధితులయ్యేది ఆర్వో, కలెక్టర్లే.. ఇదే పార్టనర్స్ ఇన్ క్రైమ్ థియరీ.టీడీపీ హిట్ లిస్టులో అధికారులని చేర్చి.. వాళ్లని టీడీపీని ఎగదొస్తున్నారు.
Read Also: Akkineni Nagarjuna: ఈ ఉగాదికి వస్తున్నాం.. రీమేక్ మొదలుపెడుతున్నాం అంతే