Vangalapudi Anitha: మంత్రి మేరుగ నాగార్జున దళితుడు కాదా?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి మేరుగ నాగార్జున పేరు చివర రెడ్డి అనే పదం కనిపించడంపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి మేరుగ నాగార్జున తాను దళిత బిడ్డ అన్న విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని వంగలపూడి అనిత సెటైర్ వేశారు. దళితుల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతుంటే ఆయన ఎందుకు మాట్లాడరంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా మౌనంగా ఉండటంపై ఆమె మండిపడ్డారు. మంత్రి పదవి, బుగ్గ కారు వచ్చాక పూర్తిగా పాలెగాళ్ళలో కలిసిపోయారని.. అందుకే వైసీపీ నేతలు ఆయనకు ‘రెడ్డి’ అనే తోక తగిలించారంటూ వంగలపూడి అనిత ఆరోపించారు.
కాగా వాస్తవానికి మేరుగ నాగార్జున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన పేరు నాగార్జున మాత్రమే. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు. వేమూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు చేశారు. అయితే శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ పార్కు అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలకంపై మేరుగ నాగార్జున పేరును మేరుగ నాగార్జునరెడ్డి అని రాయించారు. ఈ విషయాన్ని ఉద్దేశించి తాజాగా వంగలపూడి అనిత విమర్శల వర్షం కురిపించారు. ఆయన దళిత నేతో లేదా రెడ్డి నేతో స్పష్టం చేయాలన్నారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్‌పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
మేరుగ నాగార్జున గారు! తమరు దళిత బిడ్డ అన్న విషయం మర్చిపోయినట్లున్నారు. దళితుల మీదే SC/ST అట్రాసిటీ కేసులు పెడుతుంటే మాట్లాడరు. దళితులపై అత్యాచారాలు,దళితుల హత్యలు జరుగుతున్నా మాట్లాడరు. మంత్రి పదవి, బుగ్గ కారు వచ్చాక పూర్తిగా పాలెగాళ్ళలో కలిసిపోయారు. అందుకే వాళ్ళు ఈ తోక తగిలించారు pic.twitter.com/bGuC3l9ULx
— Anitha Vangalapudi (@Anitha_TDP) May 22, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్‌మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో