AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు
అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కార్యాలయాల్లో, వాటి పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read
పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చూడాలని ఆదేశించింది.
డీజీపీ సూచనలు తప్పనిసరిగా పాటించాలి
పోలీసు భద్రత, ఎన్నికల నిర్వహణకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) 2026 అక్టోబర్ 16న జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడుతూ, ఎలాంటి అవాంఛనీయ పరిణామాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొంది.
ఎన్నికల అధికారుల గుర్తింపు కార్డులపై సర్క్యులర్
ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు తమ గుర్తింపు కార్డులను స్పష్టంగా ప్రదర్శించాలని హైకోర్టు సూచించింది. పరిశీలకులు లేదా ఇతర అధికారులు తమ గుర్తింపును నిరూపించుకునే విధంగా ఎన్నికల సంఘం ఒక సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల గుర్తింపుపై స్పష్టత ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భద్రత, పారదర్శకత, అధికారుల గుర్తింపు వంటి అంశాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
-
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
-
YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!