Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla: టెస్లా ఫ్లయింగ్ రోడ్‌స్టర్ కేవలం బిగినింగ్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఎలాన్ మస్క్ ఇంకా పెద్ద ప్లాన్లతో ముందుకు రాబోతున్నాడనే విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టెస్లా ఫ్లయింగ్ రోడ్‌స్టర్ గురించి మీడియాలో ఎన్నో హెడ్‌లైన్స్ వస్తున్నప్పటికీ, ఎలాన్ మస్క్ అసలు ప్లాన్లు అంతకుమించి ఉన్నాయట. ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్లు, డ్రైవర్ లేని రోబోటాక్సీల వైపుగా మస్క్ ఆలోచిస్తున్నారట. ఆటోమొబైల్ రంగాన్ని, భవిష్యత్తును పూర్తిగా మార్చేయాలని చూస్తున్న టెస్లా నెక్ట్స్ లెవెల్ డెవలప్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ 15న జరిగిన డెమోలో నెక్ట్స్ జనరేషన్ టెస్లా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ రాకెట్-ప్రేరేపిత థ్రస్టర్ల సహాయంతో గాల్లోకి లేచి షార్ట్ ఎయిర్‌బోర్న్ విన్యాసాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్పేస్ఎక్స్ టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ఈ ఫీచర్‌తో ఈ కారు అందరి దృష్టిని ఆకర్షించినా, ఇది నిజమైన ఫ్లయింగ్ కార్ అయితే కాదు. ఇది విమానంలా గాల్లో చాలాసేపు ఎగరలేదు. అయితే ఈ వెహికల్ ప్రొడక్షన్ మాత్రం 2028లో స్టార్ట్ అవుతుందని టెస్లా చెబుతోంది. ఈ స్పోర్ట్స్ కార్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ, కంపెనీ దీనితో పాటు ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్లు, రోబోటాక్సీ సర్వీసులు అనే మరో రెండు బిగ్ ప్రాజెక్టులపై కూడా విపరీతంగా పెట్టుబడులు పెడుతోంది.
Also Read
- NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
- IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
- Xiaomi TV A Pro e Series: షియోమి నుంచి 85 అంగుళాల 4K QLED టీవీలు.. 120Hz రిఫ్రెష్ రేట్, Google TVతో కొత్త సిరీస్ లాంచ్!
- Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
మానవులకు సాయం చేసేలా టెస్లా ఆప్టిమస్ రోబోట్ల తయారీ జరుగుతోంది. మనుషులకు ప్రమాదకరంగా ఉండే, లేదా ఒకే రకమైన పనులను రోజూ చేస్తూ బోర్ కొట్టించే పనులను చేయడానికి వీలుగా ఈ హ్యూమనాయిడ్ రోబోట్లను డిజైన్ చేస్తున్నారు. ఫ్యాక్టరీలు, వేర్‌హౌస్‌లలో, భవిష్యత్తులో ఇళ్లలో కూడా మనుషులకు సాయపడేలా ఆప్టిమస్ ఉంటుంది. వస్తువులను గుర్తించడం, ఎవరి సహాయం లేకుండా స్వయంగా కదలడం, చుట్టుపక్కల వాతావరణంతో మమేకమవడం వంటి పనులను రోబోట్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌ను టెస్లా డెవలప్ చేస్తోంది. కాకపోతే ఈ ఆప్టిమస్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉంది. ఇప్పటివరకు మార్కెట్లో పెద్దఎత్తున అందుబాటులోకి రాలేదు.
ఇక టెస్లా సెకండ్ మేజర్ ప్రాజెక్ట్ అయిన రోబోటాక్సీ విషయానికి వస్తే, ఇది మనుషులు డ్రైవర్లుగా ఉండాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ లేదా ప్రయాణ సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో వస్తోంది. దీనికోసం కంపెనీ స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ ఏవీ లేకుండా నడిచే సైబర్‌క్యాబ్ అనే టూ-సీట్ అటానమస్ వెహికల్‌ను తయారు చేసింది. ఆల్రెడీ ఆస్టిన్ నగరంలో ఈ రోబోటాక్సీ సర్వీసులను టెస్లా ఇంట్రడ్యూస్ చేసింది. వాటిని మరింత విస్తరించే పనిలో ఉంది. ఫ్యూచర్లో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీల వల్ల ట్రావెలింగ్ చాలా ఈజీగా, అందరికీ అందుబాటులోకి వస్తుందని కంపెనీ నమ్ముతోంది. అయితే దీనికోసం రెగ్యులేటరీ రూల్స్, సేఫ్టీ ఇష్యూస్, టెక్నికల్ ఛాలెంజెస్ను అధిగమించడం చాలా ముఖ్యం.
ఈ ప్రాజెక్టులు ఎందుకు అంత ముఖ్యం అంటే, టెస్లా కేవలం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసే కంపెనీగా మాత్రమే మిగిలిపోవాలని అనుకోవడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, అటానమస్ ట్రాన్స్‌పోర్టేషన్ మీద కంపెనీ ఫోకస్ పెరగడం వల్ల కార్ల అమ్మకాలతో పాటు కొత్త బిజినెస్ అవకాశాలు కూడా ఓపెన్ అవుతాయి. ఆప్టిమస్ వల్ల ఫిజికల్ వర్క్ ఆటోమేట్ అవుతుంది, అలాగే రోబోటాక్సీ సర్వీసులు సిటీల్లో జనాల తిరుగుబాటు రూపురేఖలనే మార్చేస్తాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టులు కూడా జనాల మధ్యలోకి పెద్దఎత్తున రావడానికి ముందే బోలెడన్ని టెక్నికల్, రెగ్యులేటరీ, కమర్షియల్ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. రోడ్‌స్టర్ తన గాలి విన్యాసాలతో అందరి కళ్లూ తనవైపు తిప్పుకున్నప్పటికీ, ఫ్యూచర్లో టెస్లా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మాత్రం ఆప్టిమస్, రోబోటాక్సీలే అసలైన కీలక పాత్ర పోషించనున్నాయి.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..