Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం
- ప్రాణం తీసిన మ్యాగీ
- ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మ్యాగీ ఒక కుటుంబాన్ని బలితీసుకుంది. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
గ్రేటర్ నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తల్లిదండ్రులతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాలను పరిశీలించి పోస్ట్‌మార్టానికి తరలించారు.
Also Read
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒక పదార్థం అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబం చివరిగా టీ తాగి, మ్యాగీ తిన్నట్లు సమాచారం. ఆ తర్వాత కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అయితే మరణానికి గల కచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఐదు మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే అసలు మరణ కారణం వెల్లడి అవుతుంది. పోలీసులు ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఐదుగురి మరణాలు విషాహారం వల్లే సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఏదో తిన్న తర్వాతే ఈ మరణాలు సంభవించాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. చివరిగా టీ, మ్యాగీని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పదార్థాలే మరణాలకు కారణమయ్యాయా లేక మరేదైనా ఇతర కారణం ఉందా అనేది పోస్ట్‌మార్టం నివేదిక విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
ట్రెండింగ్
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!