టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ కు మధ్యలో, సీఎం నివాసానికి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు మారణాయుధాలతో తెగబడినా.. పోలీసులు పట్టించుకోలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పోలీసుల…
ఏపీలో టీడీపీ నేతల అరెస్టుల పర్వ కొనసాగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహదేవ సందీప్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హై డ్రామా చోటుచేసుకుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో తిడుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసారని పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ నాయుడు పై చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు…