తెలుగురాష్ట్రాల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేరాల కట్టడి/నియంత్రణకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అత్యాధునిక సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మనిషి జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత విలువైందో అందరికీ తెలిసిన విషయమే. అదే తమకు అనుకూలంగా మార్చుకొని కొంతమంది మోసగాళ్ళు అమాయకులను సాధారణ వ్యక్తి మొదలుకొని…
రాష్ట్ర డీజీపీకి ఇప్పటికే పలు సందర్భాల్లో లేఖలు రాస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ మరోసారి డీజీపీకి లేఖ రాసిన ఆయన.. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ కార్యకర్త మురళీని వైసీపీ గూండాలు అక్రమంగా నిర్బంధించారు.. హత్యాయత్నానికి పాల్పడ్డారని.. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని.. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందని పేర్కొన్నారు.. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…