డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల్‌పై విడుదలయ్యారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2),…
ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతోంది. తన హత్యకు కుట్ర జరుగుతోందని, రెక్కి నిర్వహించారని రాధా కామెంట్ చేయడంతో అసలేం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తాజాగా వంగవీటి రాధా వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాధాపై రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు చంద్రబాబు. రాధా తనకు కేటాయించిన గన్ మెన్లను తిరస్కరించడం సరి కాదన్నారు చంద్రబాబు. వ్యక్తిగత భద్రత…
రాష్ట్ర డీజీపీకి ఇప్పటికే పలు సందర్భాల్లో లేఖలు రాస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ మరోసారి డీజీపీకి లేఖ రాసిన ఆయన.. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ కార్యకర్త మురళీని వైసీపీ గూండాలు అక్రమంగా నిర్బంధించారు.. హత్యాయత్నానికి పాల్పడ్డారని.. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని.. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందని పేర్కొన్నారు.. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…
రాజధానిగా అమరావతిని అమలుచేయాలంటూ రైతులు, ప్రజాసంఘాలు చేపట్టిన పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైసీపీ వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. వైసీపీ ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులిస్తున్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణిచేయాలనే…
అమరావతి రైతుల మహా పాదయాత్రకు డీజీపీ సవాంగ్ అనుమతి ఇచ్చారు. రైతుల పాదయాత్రకు 20 షరతులతో డీజీపీ అనుమతి ఇచ్చామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించారు. గుంటూరు అర్బన్, రూరల్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డీజే సౌండ్లు, బహిరంగసభలు నిర్వహించవద్దని డీజీపీ…
మాదక ద్రవ్యాల నియంత్రణపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యయనం చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉంది. దీనిపై ఎన్‌ఐఏ సహకారం తీసుకుని…
టీడీపీ నేత పట్టాభికి ఏం జరిగినా డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం వైఎస్ జగన్‌దే అన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పట్టాభి అరెస్ట్‌పై స్పందించిన ఆయన.. ప్రజల్ని రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి… కానీ, దాడికి గురైన పట్టాభినే అరెస్ట్ చేశారని.. దీంతో.. వీరు ప్రజల కోసం పనిచేసే పోలీసులు కాదని తేలిపోయిందన్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు, ప్రతిపక్ష నేతలకీ రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేసిన నారా లోకేష్..…