Chandra Babu: వివేకా హత్య కేసులో దొంగలను పట్టుకున్న సీబీఐది తప్పా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి: టీడీపీ కార్యాలయంలో రెండో రోజు సర్పంచుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సర్పంచ్‌లకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. చెత్త పన్నుకు వ్యతిరేకంగా పంచాయతీల్లో తీర్మానం చేయాలని వారికి హితవు పలికారు. టీడీపీ సర్పంచ్‌లు ఉన్న ప్రతి చోట చెత్త పన్నుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు ఇవ్వకుంటే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలని.. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు.
కాగా వివేకా హత్య కేసు విషయంలో తండ్రి తర్వాత తండ్రి లాంటి బాబాయ్‌ను చంపి టీడీపీ మీద జగన్ విమర్శలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ కేసులో దొంగలను పట్టుకున్న సీబీఐది తప్పంటారా అని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని వైఎస్ వివేకా అన్నందుకు కక్ష కట్టారన్నారు. పరిటాల రవి హంతకులను ఒక్కొక్కర్ని చంపేశారని.. రాష్ట్ర ముఖ్యమంత్రే నేరాలు, ఘోరాలు చేస్తూ హత్య రాజకీయాలు చేస్తే ఎలా అంటూ నిలదీశారు. సర్పంచ్‌లను సీఎం జగన్ ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గ్రామాల్లో సర్పంచ్‌లను కాదని ఒక్క పని చేయడానికైనా వీల్లేదన్నారు. గ్రామాల్లో సర్పంచులే సుప్రీం అన్నారు. టీడీపీ సర్పంచులు పట్టుదలతో వ్యవహరిస్తే వైసీపీ సర్పంచుల నుంచే మద్దతు లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Vizag Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు!
గ్రామాల్లో టీడీపీ హయాంలో కట్టించిన భవనాలకు రంగులేసుకోవడంతోనే వైసీపీ పాలన సరిపోతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రూ. 7 వేల కోట్లకు పైగా నిధులు ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి వచ్చాయన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల ఖాతాలకు చేరాల్సిన నిధులను ప్రభుత్వం తీసేసుకుందని మండిపడ్డారు. గ్రామాల్లో పేదలకిచ్చిన ఇంటి జాగా నివాస యోగ్యంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల సేకరణలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. పేదలకిచ్చిన భూములన్నీ లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాయని.. ఓ పంచాయతీ నుంచి మరో పంచాయతీకి రోడ్లేయలేని సీఎం జగన్.. విమానాలు తెస్తారట అంటూ సెటైర్లు వేశారు. విమానాలు వస్తే రోడ్లతో పనే ఉండదు.. రోడ్ల మీద వ్యవసాయం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టి.. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు.. విపరీతంగా అప్పులు తెచ్చారు.. కానీ జెన్కో ఉద్యోగులకు జీతాలివ్వలేకపోయారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఒక్క రోజైనా ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇచ్చామా అని అడిగారు. సీఎం జగన్ హోల్ సేలుగా దోచుకుంటుంటే.. మిగిలిన అధికార పార్టీ నేతలు చిల్లర దొపిడీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుకను హోల్ సేల్‌గా అమ్మేశారని.. గ్రామాలకు రావాల్సిన సెస్ రాకుండా చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..