Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
- ఫ్రాన్స్‌లో అదుపుతప్పిన సంబరాలు..
- వీధుల్లోకి దూసుకొచ్చిన 20 వేల మంది ఫ్యాన్స్
- హింసాత్మకంగా మారిన పీఎస్జీ సంబరాలు
- రంగంలోకి 22,000 మంది పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Psg Violence: ఫ్రాన్స్ దేశంలో పారిస్ సెయింట్ – జర్మైన్ (PSG) ఫుట్‌బాల్ క్లబ్ సాధించిన చారిత్రాత్మక విజయం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యూఈఎఫ్ఏ (UEFA) ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో పీఎస్జీ ఛాంపియన్‌గా నిలవడంతో ఫ్రాన్స్ వ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ గెలుపు సంబరాలు కాస్తా క్షణాల్లో హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 400 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
ఒక్క పారిస్‌లోనే 283 మంది అరెస్ట్
ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 416 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో కేవలం రాజధాని పారిస్ నగరంలోనే 283 మందిని పట్టుకున్నారు. బుడాపెస్ట్‌లో పీఎస్జీ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణే ఈ భారీ ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తోంది.
Also Read
- Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
- Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
- Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
- Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు...!
రంగంలోకి 22,000 మంది పోలీసులు..
ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ ఈ హింసపై తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాయపడిన ఏడుగురు పోలీసుల ఆరోగ్య పరిస్థితిని ఆయన పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులు మరింత చేయి దాటకుండా ఉండేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 22,000 మంది పోలీసు అధికారులను రంగంలోకి దించింది. ఒక్క పారిస్ నగరంలోనే భద్రత కోసం 8,000 మంది పోలీసులను ప్రత్యేకంగా మోహరించారు.
యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో పీఎస్జీ పెనాల్టీ షూటౌట్లో ఘన విజయం సాధించింది. ఈ గెలుపు వార్త వినగానే దాదాపు 20,000 మందికి పైగా మద్దతుదారులు ఒక్కసారిగా పారిస్ వీధుల్లోకి దూసుకొచ్చారు. ఆనందోత్సాహాలతో ఊగిపోయిన ఫ్యాన్స్.. పారిస్ రింగ్ రోడ్‌ను దిగ్బంధించి భారీగా ట్రాఫిక్ జామ్ చేశారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు రెచ్చిపోయి 6 వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘటనలు ఫ్రాన్స్ భద్రతా ఏర్పాట్లపై పలు విమర్శలకు దారితీశాయి. అయితే అంతర్గత వ్యవహారాల మంత్రి ఈ విమర్శలను తిప్పికొడుతూ.. దేశంలో భద్రత పటిష్టంగానే ఉందని స్పష్టం చేశారు.
అయితే అసలైన సవాల్ ఆదివారం (ఈరోజు) ఎదురుకానుంది. పీఎస్జీ ఘన విజయం సాధించినందుకు గానూ ప్రసిద్ధ ఈఫిల్ టవర్ సమీపంలో భారీ ‘విక్టరీ పరేడ్’ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు దాదాపు 1 లక్ష మందికి పైగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ జనసందోహాన్ని నియంత్రించడం ఇప్పుడు ఫ్రాన్స్ పోలీసులకు ఒక పెద్ద సవాల్‌గా మారిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
-
MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
-
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!