Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- గోదావరి డెల్టా రైతులకు శుభవార్త
- ప్రధాన కాలువలకు సాగునీరు విడుదల
- 10 లక్షల 13 వేల ఎకరాలకు సాగునీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి డెల్టా రైతులకు శుభవార్త అందింది. ఖరీఫ్ సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని గోదావరి డెల్టా పరిధిలోని ప్రధాన కాలువలకు సాగునీటిని అధికారులు విడుదల చేశారు. ప్రతి ఏడాది నిర్ణీత తేదీతో పోలిస్తే.. ఈసారి ఒక రోజు ముందుగానే సాగునీటిని విడుదల చేయడం విశేషం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ధవలేశ్వరం బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కాలువల్లోకి నీటిని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గోదావరి జలాలకు పూజలు నిర్వహించిన అనంతరం కాలువ గేట్లను ఎత్తి సాగునీటిని విడుదల చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. గోదావరి డెల్టా పరిధిలోని సుమారు 10 లక్షల 13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలోని రైతులు ఈ నీటి విడుదలతో ప్రయోజనం పొందనున్నారు.
Also Read
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
సాగునీరు ముందుగానే విడుదల కావడంతో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం చేసుకునే అవకాశం లభించింది. ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ‘రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. గోదావరి డెల్టా పరిధిలోని ప్రతి ఎకరాకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?