Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం
- తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
- నాలుగు మృతదేహాలు లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mantralayam Tragedy: కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నదిలో మునిగిపోయిన వారిలో ఇప్పటివరకు నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఒకరి కోసం అధికారులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. గల్లంతైన వారంతా బంధువుల ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరయ్యేందుకు మంత్రాలయానికి వచ్చినట్లు వచ్చారు. పూజ కార్యక్రమాలకు ముందు సరదాగా తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నదిలో నీటి లోతును సరిగా అంచనా వేయలేకపోవడంతో వారు ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో శనివారం ధను (23) అనే యువకుడి మృతదేహం లభించగా.. ఆదివారం సతీష్ (35), యువన్ చంద్ర (5) సంధ్య (22) మృతదేహాలను కూడా గుర్తించి వెలికితీశారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన రాఘవేంద్ర (25) కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే ఈ ఘటనలో ఆదోనికి చెందిన అపర్ణ అనే యువతి సురక్షితంగా బయటపడింది. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా సహాయక బృందాలు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశాయి. ఈ విషాద ఘటనతో మంత్రాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనతో ఎదురుచూస్తుండగా.. మిగిలిన ముగ్గురి కోసం అధికారులు యుద్ధప్రాతిపదికన గాలింపు కొనసాగిస్తున్నారు.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి