మాసశివరాత్రి ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సూర్యుని వల్ల ఆరోగ్యం, శివుని వల్ల సంపదలు కలుగుతాయి. ఆదివారం రవివారం. అందుకే నవగ్రహాల్లో మొట్టమొదటివాడైన సూర్యుడిని ఆరాధన చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆదివారం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ ఉదయం వేళ ”జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం” అనే మంత్రాన్ని జపిస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం, సంపద మనకు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆదివారం నాడు ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది. సూర్యుని అనుగ్రహం లేకపోతే కోరిన విద్య లభించదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.