ఈమధ్యకాలంలో అరుదైన పూలు, పండ్ల మొక్కల్ని పెంచుతున్నారు. మంచి అభిరుచి కలిగిన వ్యక్తులు ఖర్చుకి వెనుకాడడం లేదు. ఏదైనా చెట్టుకు పది లేక వంద పళ్లు కాస్తాయి. అయితే, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక నర్సరీలో అరుదైన కమలా చెట్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకటి కాదు వంద కాదు రెండు వేల కమలాపళ్లు విరబూసి అబ్బురపరుస్తున్నాయి. ఎనిమిది నుంచి పదేళ్ల వయసు ఉన్న ఈ మొక్క చూపరులను కనువిందు చేస్తోంది. 25 నుంచి 30 వేల రూపాయలు ధర పలుకుతున్న ఈ చెట్టును అలంకరణ కోసం హాట్ కేక్ లా కొనుగోలు చేస్తున్నారు.
మనకు కుండీలలో ఉండే కమలా మొక్కలు అరుదుగా కనపడతాయి. అక్కడక్కడ అందం కోసం ఈ మొక్కలు పెంచుకున్నప్పటికీ పది నుండి పాతిక కాయలు ఉండటం విశేషం. అలాంటిది కుండీలో ఉండే ఒకే చెట్టుకు రెండు వేల కమలాలుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపులంక శివాంజనేయ నర్సరీలో ప్రస్తుతం ఆ అరుదైన కమలా చెట్లు సందడి చేస్తున్నాయి. కుండీలో ఉండే చెట్టుకి రెండువేల కాయలు ఉంటాయా..? అనే అనుమానం వ్యక్తం చేసే వాళ్లు వచ్చి లెక్కపెట్టుకోవచ్చు. కాస్త అటు ఇటుగా లెక్క సరిపోతుందని రైతు చెబుతున్నారు.
Read Also: Etala Rajender: కేసీఆర్ మాటలకు పొంగిపోను.. అవమానాలను మర్చిపోను
మంచి దిగుబడే కాకుండా అలంకరణలో ముందుంటుంది ఈ మొక్కల చెట్లు. కార్పొరేట్ సంస్థలు,ఫంక్షన్ హాల్స్ వద్ద వీటిని ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు కొనుగోలు చేసి తీసుకెళ్లుతున్నారు. ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు ఉండే ఈ చెట్టు ధర ఎంతో తెలుసుకోవాలని ఉందా. ఒక్కొక్క చెట్టు పాతిక నుంచి ముపైవేల రూపాయలు పలుకుతుంది. అరుదైన మొక్కలను మన దేశ నర్సరీ రంగానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీటిని దిగుమతి చేస్తున్నట్లు నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు. మొత్తం మీద ఈ కమలా చెట్టు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. మీకు వీటిని చూడాలంటే ఛలో కడియపులంక.
(రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ సహకారంతో)
Read Also: Student Drowns In Ganga: విషాదం.. గంగానదిలో మునిగి ఐఐటీ విద్యార్థి మృతి