Aadhar Update : ఏపీ వాసులకు అలర్ట్.. రేపటి నుంచి గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ప్రతి అవసరానికి ఆధార్ కార్డు తప్పనిసరైంది. అయితే.. ఆధార్ కార్డులో తప్పులు ఉండటంతో ఎంతో ముఖ్యమైన పనులు కూడా పెండింగ్ పడుతున్నాయి. అయితే.. ఆధార్ సెంటర్‌లకు దగ్గరకు వెళితే అక్కడ క్యూ గట్టిగానే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో.. ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించనున్నట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ నెల 19 నుంచి 24 తేదీ వరకు ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా.. ఫిబ్రవరిలో 7 నుంచి 10 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మరోసారి ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది ఏపీ ప్రభుత్వం.
Also Read : Tamil Nadu: మనసును కలిచివేస్తున్న ఆత్మహత్య.. కట్టుకున్నది లేదని..!
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగిలి షన్‌మోహన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్‌చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు పొందేలా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌లు తగిన ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్ సేవల పైనే దృష్టి పెడతారు. ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం పదేళ్లలో కనీసం ఒకసారి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. ఇలా అప్‌డేట్ చేసుకోనివారు రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారుల అంచనా.
Also Read : Sreemukhi : శ్రీముఖి అందాలు ప్రదర్శనలో బహుముఖి
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!