Dharmana Krishnadas: ‘ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే’.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Krishnadas: శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మాజీ డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, బుడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబుతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ములాఖాత్‌లో కలిసి పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలవుతోందని విమర్శించారు.
సీదిరి అప్పలరాజు అరెస్ట్ కూటమి ప్రభుత్వ కక్షసాధింపునకు పరాకాష్ట అని ధర్మాన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద ఘటనను హత్య కేసుగా చిత్రీకరించి తండ్రి, కుమారుడిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని వారి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హోంమంత్రి, మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలిపై కూడా ధర్మాన విమర్శలు గుప్పించారు. పలాస ప్రాంతమంతా పోలీసులు మోహరించి ఎవరినీ వెళ్లనీయకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులందరినీ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు అప్పలరాజు అయితే రేపు తాను, ఎల్లుండి బుడి ముత్యాల నాయుడు లక్ష్యంగా మారవచ్చని వ్యాఖ్యానించారు. అయితే కేసులకు, జైళ్లకు వైసీపీ నాయకులు భయపడరని స్పష్టం చేశారు.
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
మాజీ ఉపముఖ్యమంత్రి బుడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు రోడ్లపై భారీగా మోహరించి వైసీపీ నాయకులను ముందుగానే అడ్డుకున్నారని తెలిపారు. చిన్న ఘటనలను పెద్దవిగా చూపిస్తూ అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. రోడ్డు ప్రమాదాలు సహజంగా జరుగుతుంటాయని, వాటిని ఉద్దేశపూర్వక నేరాలుగా మార్చి సీదిరి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సీదిరి అప్పలరాజుకు ధైర్యం చెప్పేందుకు, పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడానికే తాము జైలుకు వచ్చామని చెప్పారు.
మాజీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ, సీదిరి అప్పలరాజు అరెస్ట్ అక్రమమనే విషయం అందరికీ తెలుసన్నారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడం దురదృష్టకరమే అయినప్పటికీ, రోడ్డు ప్రమాద కేసులో సెక్షన్ 105 ఎలా వర్తింపజేస్తారో అర్థం కావడం లేదన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి చర్యలు ఉండవని పేర్కొన్నారు. వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారని రవిబాబు ఆరోపించారు. వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నప్పటికీ వాటికి పార్టీ నాయకులు భయపడరని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు శాశ్వతం కావని, ఈ తరహా అక్రమ కేసులతో సీదిరి అప్పలరాజును భయపెట్టలేరని అన్నారు.
తాజావార్తలు
-
Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఒక్కటే ఛాన్స్!
-
Abhijeet Dipke: వాంగ్‌చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
-
Honda ADV 160: మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. హోండా ADV 160తో సహా 10 టూవీలర్ల ఆవిష్కరణ..
-
Dharmana Krishnadas: ‘ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే’.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
-
KTR: ‘రాజ్యమా ఉలిక్కిపడు’.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!