Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan Cricket Team: టీమిండియా జపాన్ పర్యటనకు చేరుకుంది. ఆసియా క్రీడలకు ముందు జపాన్తో భారత్ టీ20 మ్యాచ్ ఆడనుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్, జపాన్ జట్లు తొలిసారి తలపడనున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్కు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకైక టీ20 మ్యాచ్ను సుజుకి కప్ పేరుతో నిర్వహిస్తున్నారు. తోచిగి ప్రీఫిక్చర్ లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో రేపు (మంగళవారం) ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
అయితే.. రేపు మైదానంలో టీమిండియా ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటానికి సిద్ధమవుతుంటే.. మైక్రోఫోన్ ముందు కూర్చునే భారతీయ కామెంటర్లు మాత్రం అంతకంటే పెద్ద పోరాటానికి సిద్ధమవ్వాల్సి వస్తోంది! ఎందుకంటే.. జపాన్ క్రికెట్ టీమ్ లోని ఆటగాళ్ల పేర్లు చూస్తే మన కామెంటేటర్ల నోళ్ళు తిరగడం, నాలుకలు మడతపడటం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా ‘ధోనీ’, ‘కోహ్లీ’, ‘శర్మ’ అని పలకడానికి అలవాటుపడిన మన వాళ్లు, రేపు ఈ జపనీస్ పేర్లను ఎలా చదువుతారో చూడాలి. టీమిండియాతో జపాన్ టీమ్ తొలిసారిగా తలబడుతోంది కాబట్టి ఈ పేర్లు అన్ని కొత్తగానే ఉంటాయి. జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ-ఫ్లెమింగ్ (Kendel Kadowaki-Fleming). ఇదొక్క పేరు చాలు ఎంత కఠినంగా ఉన్నయో చెప్పడానికి.. ఇప్పుడు జపాన్ జట్టులోని పేర్లను చూద్దాం..
Also Read
- IND Vs WI 4th T20: ఉప్పల్లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
జపాన్ క్రికెట్ టీమ్..
కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా హింజే, బెంజమిన్ ఇటో-డేవిస్, అలెస్టర్ కడోవాకీ-ఫ్లెమింగ్, కోహెయ్ కుబోటా, జేక్ కుసుడ-నైర్న్, వటరు మియాఉచి (వికెట్ కీపర్), రియో సకురానో-థామస్, అలెక్స్ శిరాయ్-పాట్మోర్ (వికెట్ కీపర్), షోమా సుగయ-స్లేటర్, డెక్లాన్ సుజుకి-మెక్కాబ్, త్సుయోషి తకాడా, ఇబ్రహీం తకహాషి, మకోటో తానియామ, లాచ్లాన్ యమమోటో-లెక్
తాజావార్తలు
-
IND Vs WI 4th T20: ఉప్పల్లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!