AP Government: స్టార్ హోటళ్లలో నిర్వహించే బార్ల లైనెన్స్ ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ల ఛార్జీలను తగ్గిస్తూ శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో త్రి స్టార్ సహా ఆ పై స్థాయి హోటళ్లలో బార్ల లైసెన్సు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.. పర్యాటకంతో పాటు ఆతిథ్యరంగానికి ఊతమిచ్చేలా బార్ల రిజిస్ట్రేషన్ ఛార్జి, లైసెన్సు ఫీజులను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏడాదికి లైసెన్సు ఫీజును రూ.5 లక్షల మేర, నాన్ రిఫండబుల్ ఛార్జీ రూ. 20 లక్షల మేర నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
Read Also: Iran: ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు..500 మందికి గాయాలు..
దేశంలోనే ఎక్కడా లేనంత ఎక్కువగా ఉన్న ఈ ఫీజులు, ఛార్జీలను తగ్గించాలంటూ ఏపీ హోటల్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు కూటమి ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా లైసెన్స్ ఫీజులను సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. బార్ లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ ఛార్జీని తగ్గించాల్సిందిగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెరిగేందుకు, రిసార్టులు, హోటళ్లకు ఈ నిర్ణయం ప్రోత్సాహం కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.. స్థానిక జనాభాతో సంబంధం లేకుండానే స్టార్ హోటళ్లు ఉన్నచోట ఈ లైసెన్సు ఫీజు, ఛార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.. 2025 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..