ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. సీఎం చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారు.. కానీ, నేటి పర్యటన అత్యంత నిరుత్సాహానికి గురిచేసిందన్నారు.. అసలు, మత్స్యకారులకు ఏం చేశామో చెప్పలేదు, ఏమి చేయబోతున్నారో చెప్పలేదని విమర్శించారు.. 44 ఏండ్లలో టీడీపీ మత్స్యకారులకు ఏం చేసిందో చెబితే సంతోషించేవాళ్లం అన్నారు.