Nandamuri Balakrishna: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.. వైసీపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.. అయితే, తాను ప్రతినిథ్యం వహిస్తోన్న శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం పర్యటనలో ఉన్న సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక లలో టీడీపీ విజయంపై స్పందించారు.. పులివెందులలో జరిగిన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరిగాయి.. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని తెలిపారు బాలయ్య.. ఇక్కడ జరిగిన ఎన్నికలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అక్కడి ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఈ ఎన్నికల్లో 11 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నామినేషన్లు కూడా వేశారు.. ప్రజలు ధైర్యంగా వచ్చి ఓట్లు వేశారు.. అంటే.. అక్కడ స్వాతంత్య్రం వచ్చినట్టే అని పేర్కొన్నారు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..
Read Also: AP High Court: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై విచారణ పూర్తి..