Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Nara Chandrababu Naidu Key Remarks In Peddannavaripalli Sri Sathya Sai District

CM Chandrababu: అభివృద్ధి – సంక్షేమమే లక్ష్యం.. ఫేక్ రాజకీయాలకు చెక్‌..!

Published Date :November 1, 2025 , 5:18 pm
By Sudhakar Ravula
  • అభివృద్ధి - సంక్షేమమే లక్ష్యం, ఫేక్ రాజకీయాలకు చెక్..
  • శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
  • పారదర్శక పాలన, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా..
  • రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు..
CM Chandrababu: అభివృద్ధి – సంక్షేమమే లక్ష్యం.. ఫేక్ రాజకీయాలకు చెక్‌..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CM Chandrababu: అభివృద్ధి – సంక్షేమమే లక్ష్యం, ఫేక్ రాజకీయాలకు చెక్ పెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విపత్తుల నిర్వహణ, రాయలసీమ ప్రగతిపై అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. పారదర్శక పాలన, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక, ఇంటి వద్దకే పింఛన్, చరిత్రలో నిలిచే DBTగా పేర్కొన్నారు.. అభివృద్ధి చేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వగలమని తెలిపారు.

ఇక, నేను కూడా బటన్ నొక్కచ్చు, పరదాలు కట్టుకుని ఉండొచ్చు. కానీ, ప్రజలతోనే ఉండాలి, ప్రజలకు నేరుగా సేవలందించాలనుకున్నాం.. అందుకే మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాం అని తెలిపారు సీఎం చంద్రబాబు.. పింఛన్ల పంపిణీ కోసం ప్రతీ ఏడాది 33 వేల కోట్లు రూయలు ఖర్చు చేస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రం ఇంత ఖర్చు పెట్టడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు రూ.57,764 కోట్లు పింఛన్లు ఇచ్చామని, ఇది దేశంలోనే అతిపెద్ద డీబీటీ (Direct Benefit Transfer) కార్యక్రమమని పేర్కొన్నారు. “నేను ఈ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తాను.. కానీ, పింఛన్ల పంపిణీలో కచ్చితంగా పాల్గొంటాను అని వెల్లడించారు..

Also Read

  • Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
  • Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్‌..
  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
  • Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్‌ సూపర్‌ డ్యాన్స్..
Add as a preferred
source on google

మరోవైపు, మొంథా తుఫాన్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు.. టెక్నాలజీతో నష్ట నివారణ చర్యలు తీసుకున్నామన్నారు.. తుఫాను వల్ల జరిగిన విధ్వంసాన్ని, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం వివరించారు. తుఫాను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినప్పటికీ, ఎక్కడికక్కడ టెక్నాలజీ వినియోగించి, ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. నష్టపోయిన రైతాంగం 5 రోజుల్లో కోలుకునేలా చేశామన్నారు. తుఫాను వల్ల రూ.5250 కోట్ల ఆస్తి నష్టం, ఇద్దరు ప్రాణనష్టం జరిగిందని, దీనిపై కేంద్రం సాయం కోరామని చెప్పారు. ఇక, రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెట్టుబడుల విషయంలో స్పష్టమైన ప్రణాళిక ఉందని సీఎం ప్రకటించారు. కియా పరిశ్రమ కోసం యుద్ధ ప్రాతిపదికన హంద్రీనీవా నీరు తీసుకొచ్చామని, ప్రస్తుతం కరవు జిల్లాలోనే కార్లు తయారవుతున్నాయని గుర్తుచేశారు. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని, అనంతపురం జిల్లాలో ప్రతి చెరువుకు, ఎకరానికి నీరు ఇచ్చే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ‘నాది కూడా రాయలసీమ’ అని చెప్పుకునే వారు సొంత నియోజకవర్గం పులివెందులకు కూడా నీరు ఇవ్వలేదని, యూరేనియం ప్లాంట్ తీసుకొచ్చి అలజడులు సృష్టించారని పరోక్షంగా వైఎస్‌ జగన్‌ను విమర్శించారు ముఖ్యమంత్రి నారా చాంద్రబాబు నాయుడు..

ఏపీకి పెట్టుబడులపై స్పందించిన సీఎం చంద్రబాబు.. గడిచిన 15 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని తెలిపారు.. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే ఇండస్ట్రియల్ సమ్మిట్‌లో మరో రూ.4-5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా రానున్న రోజుల్లో అగ్రగామిగా నిలుస్తుంది. తిరుపతి దగ్గర స్పేస్ సిటీ, ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొస్తాం అని వివరించారు.. మరోవైపు ఫేక్ రాజకీయాలు, వివేకా కేసుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.. ప్రభుత్వం మంచి చేస్తుంటే ఒక ‘ఫేక్ పార్టీ’ దుష్ప్రచారం చేస్తోందని సీఎం విమర్శించారు. వైసీపీ అనేది ఒక ‘ఫేక్ పార్టీ’ అని, వారు వివేకానంద రెడ్డిని చంపి తనపై నిందలు వేయాలని చూశారని ఆరోపించారు. మొదట గుండె పోటు అన్నారు, కానీ పోస్టుమార్టంలో నెత్తిపై గొడ్డలితో నరికారని తేలిందని, ఆ రోజు ఒక సీఐతో గదిలోని రక్తాన్ని కడిగించారని తెలిపారు.. రౌడీలను, ముఠాలను పూర్తిగా తరిమికొట్టాం. ఇలాంటి సలహాలు ఇవ్వకుండా విష ప్రచారం చేస్తున్నారు. మనం ప్రజలకు మంచి చేస్తుంటే.. ఫేక్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM Chandrababu Naidu
  • Peddannavaripalli
  • Sri Sathya Sai District

తాజావార్తలు

  • Hyderabad Census : హైదరాబాద్‌లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!

  • Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు

  • Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్

  • Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!

  • Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions