Sri Sathya Sai Dist: శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో స్మశాన స్థల వివాదం కారణంగా అంతక్రియలు ఆగిపోయాయి. గ్రామంలోని స్మశాన వాటిక స్థలం వివాదం కోర్టులో కేసు నడుస్తుండటంతో అక్కడ ఖననం చేయడానికి ఆ గ్రామ రైతు ఒప్పుకోలేదు.. దీంతో ఆర్డీవో మహేష్ మరో ప్రదేశంలో ఖననం చేసుకోవాలని కోరారు. అయితే, ఎస్సీ కాలనీవాసులు మాత్రం తమకు కేటాయించిన స్మశాన వాటిక స్థలంలోనే అంతక్రియలు జరగాలని పట్టుబట్టారు. అధికారుల మాటలను పట్టించుకోకుండా శవపెట్టిక దగ్గర బైఠాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాత్రంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Ravi Teja : 2 నెలల్లో డబుల్ ట్రీట్ కి సిద్ధమవుతున్న రవితేజ?
ఇ, ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అంత్యక్రియలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ, కాలనీవాసులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. చాలా ఏళ్ల నుంచి అక్కడే మా కులస్తుల అంతిమ సంస్కరాలు చేస్తున్నాం.. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.