టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానులకు రెండు నెలల వ్యవధిలోనే డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుతున్న మాస్ జాతర చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 27న విడుదల కావాల్సిన మాస్ జాతర, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు టీమ్ అన్ని పనులను వేగవంతం చేస్తూ, అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది. ఇతర విడుదలలు కూడా లాక్ అయ్యి ఉండటంతో, ఈ తేదీనే అనుకూలంగా ఉందని బృందం భావిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది.
Also Read : Raashi Khanna : “తెలుసు కదా అలాంటి కథే.. రాశీ ఖన్నా ఎమోషనల్ పోస్ట్”
మాస్ జాతర తర్వాత రవితేజ తదుపరి ప్రాజెక్ట్ RT76 (వర్కింగ్ టైటిల్), కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నవంబర్ నాటికి పనులు పూర్తి చేసి, సంక్రాంతి 2026 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బృందం సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇప్పటికే సంక్రాంతి రేసులో MSVP, రాజా సాబ్ వంటి పెద్ద సినిమాలు ఉండటంతో, ఈ క్లాష్ రవితేజ టీంకు కాస్త సవాల్ కానుంది. పెద్ద హడావుడి నుంచి తప్పించుకుని మరో సరైన తేదీని ఎంచుకుంటే, కలెక్షన్ల పరంగా బలమైన ఫలితం సాధించవచ్చని ట్రేడ్ టాక్. ఇక ఒకే హీరో నుంచి రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలు రావడం చాలా అరుదు. పైగా రవితేజ వంటి మాస్ స్టార్ నుంచి వస్తే, బాక్సాఫీస్ దగ్గర ఫ్యాన్స్‌కి పండగే. సరైన ప్రమోషన్లు, స్ట్రాటజీతో ముందుకెళ్తే రవితేజ ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్స్ అందుకోవచ్చు అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.