Dubbing Movies Dialogue Writer Sri Ramakrishna Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో సినిమాలకు మాటల రచయితగా వ్యవహరించిన శ్రీ రామకృష్ణ తన 74వ సంవత్సరంలో అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. అనువాద సినిమాలకు తెలుగులో డైలాగ్స్ అందించిన మాటల రచయితగా శ్రీ రామకృష్ణకు మంచి గుర్తింపు ఉంది. వయోభారం రీత్యా ఏర్పడిన అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన గత కొంతకాలంగా చెన్నై తేనపేటలో ఉన్న అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈరోజు ఆరోగ్య క్షీణించడంతో రాత్రి 8 గంటలకు తేనా పేటలోని అపోలో హాస్పిటల్ లో కన్నుమూశారు. శ్రీ రామకృష్ణ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి కాగా 50 ఏళ్ల కిందట సినీ పరిశ్రమ అంతా చెన్నైలోనే కారణంగా అక్కడే స్థిరపడ్డారు.
Kalyani Vachha Vachha: ఏంటి కొండన్న ఆ గ్రేస్.. మృణాల్‌తో ఆ డ్యాన్స్ ఏంటి?
ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. శ్రీ రామకృష్ణ ముంబై, జెంటిల్మన్, చంద్రముఖి తదితర 300 చిత్రాలకు పైగా అనువాద రచయితగా పనిచేయడం మాత్రమే కాదు బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ లాంటి సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్ చేసే దాదాపు అన్ని సినిమాలకు మాటలు రాసిన శ్రీ రామకృష్ణ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రజనీకాంత్ దర్బార్ చిత్రానికి చివరిగా శ్రీ రామకృష్ణ మాటలు అందించారు. శ్రీ రామకృష్ణ పార్థివ దేహానికి రేపు ఉదయం చెన్నై సాలి గ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు గౌతం తెలిపారు. శ్రీ రామకృష్ణ మృతి చెందారన్న వార్త విన్న తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.