Rowdy Sheeter Srikanth parole Episode: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కరడుగట్టిన నేరగాడైన తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్‌కు పెరోల్ రావడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందంటూ వైసీపీ ఆరోపిస్తుంగడా.. ఇది వైసీపీ పనే అంటున్నారు టీడీపీ నేతలు.. అయితే, ఆ పెరోల్ వ్యవహారం కలకలం సృష్టించడంతో.. చివరకు పెరోల్ రద్దు చేశారు.. ఈ నేపథ్యంలో.. జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఫేస్బుక్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు..
Read Also: T20 World Cup 2024: బౌండరీ రోప్ వెనక్కి జరిపారు.. సూర్య క్యాచ్‌పై రాయుడు సెన్సేషనల్ కామెంట్స్!
శ్రీకాంత్ పెరోల్ మంజూరు, రద్దు తరువాత పలు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అరుణ.. శ్రీకాంత్ ను వాడుకున్న వాళ్లు ఎవ్వరూ ఇప్పుడు నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. శ్రీకాంత్ బాధ పడుతుంటే మీకు ఇష్టం అని అర్థం అవుతుంది.. పరిస్థితి ఇక్కడి వరకు వచ్చాక నేను ఎందుకు నోరు విప్పకూడదు..? అని ప్రశ్నించింది.. ఇంత కాలం శ్రీకాంత్ నన్ను మాట్లాడద్దు అన్నాడు.. నేను నోరు విప్పనా ? మహా అయితే చంపేస్తారు… ఇన్ని నిందలు మోసి బ్రతికే కన్నా.. దేనికైనా సిద్దపడిపోవడం మేలు అంటూ ఫేస్బుక్లో రాసుకొచ్చారు రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ..
Read Also: Bollywood : బాలీవుడ్ నుంచి AI టెక్నాలజీతో వస్తున్న ‘చిరంజీవి హనుమాన్’
కాగా, తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్.. కరడుగట్టిన నేరస్తుడు.. అతడికి పెరోల్ ఇవ్వొద్దని స్వయంగా తిరుపతి జిల్లా ఎస్పీ, నెల్లూరు కారాగారం సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారు.. కానీ, శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వాల్సిందేనంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. సిఫార్సు చేయడం.. ఓ మంత్రి వాటిని ఎండార్స్ చేయడం.. ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ అంటూ సీఎస్‌ను ఆదేశించారు. ఇక, ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలోని ఓ అధికారి అండదండలు ఉండటంతో.. ఆఘమేఘాలపై శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చేసింది.. కానీ, ఈ వ్యవహారం బయటకు వచ్చింది.. హోంమంత్రికి తెలియకుండానే పెరోల్ మంజూరు కావడం చర్చగా మారగా.. దీనిపై హోం సెక్రటరీని వివరణ కోరారు హోంమంత్రి అనిత.. ప్రభుత్వంలో కీలక అధికారి సూచనతో పెరోల్ ఇచ్చినట్టు హోంమంత్రికి తెలిపారు సెక్రటరీ.. దీంతో, పెరోల్ రద్దు చేసి విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత.. రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అయితే, శ్రీకాంత్ వైసీపీ హయాంలోనే రెచ్చిపోయాడని.. చేయని దందా, క్రైమ్ లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు..
