ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం బాగా పెరుగుతోంది. టెక్నాలజీ రంగం నుంచి హెల్త్, ఎడ్యుకేషన్, బిజినెస్, ఎంటర్టైన్మెంట్ తో పాటు.. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఏఐకి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. కథలు రాయడం నుంచి విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ సన్నివేశాల వరకు ఏఐ ద్వారా సులభతరం అవుతుంది. ఇప్పటికే కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యానిమేటెడ్ క్లిప్స్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాగా, ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఒక భారీ పూర్తి స్థాయి ఏఐ సినిమా రాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Also Read : Nandamuri : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం..
ఈ చిత్రం ‘చిరంజీవి హనుమాన్’. పురాణాల్లో అత్యంత శక్తివంతమైన దేవుడిగా, భక్తుడిగా పేరుగాంచిన హనుమంతుని శౌర్యం, భక్తి, అద్భుత గాథను ఏఐ ఆధారిత యానిమేషన్ శైలిలో చూపించబోతున్నారు. ఇది సాధారణ మిథాలజీ సినిమా కాదు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన స్పెషల్ ప్రాజెక్ట్. హనుమంతుని ధైర్యం, భక్తి, సాహసాలను ఇప్పటివరకు స్క్రీన్‌పై చూడని విధంగా చూపించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించారట. ఈ ప్రాజెక్ట్‌ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా నిర్మిస్తుండగా, విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలను.. అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో కలసి, ఏఐ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి, హనుమంతుని వ్యక్తిత్వాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నారని టీమ్ వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. అంతే కాదు ఈ చిత్రం వచ్చే ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.