విశాఖ రాష్ట్ర రాజధానిగా నిర్ణయించబడుతుతుందని మంచి ప్రకటన చేసారు సిఎం జగన్. రాష్ట్ర ప్రజలంతా సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. జగన్ నిర్ణయం అద్బుతం.. ప్రజలంతా స్వాగతిస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఏదని గూగుల్ లో సెర్చ్ చేసిన విశాఖ నే చూపిస్తుందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అన్ని రకాలుగా కనెక్టివిటీ హబ్ గా విశాఖ ఉంది. పారిశ్రామిక దిగ్గజాలు సైతం విశాఖపై ఆసక్తి చూపుతున్నారు. స్వయంగా జగన్ నే విశాఖలో ఉంటానని పారిశ్రామిక వేత్తలకు చెప్పారు. విశాల తీర ప్రాంతం… ఇండస్ట్రియల్ కారిడార్ గా మారబోతుంది. పోర్ట్స్, హార్బర్, జట్టీలు యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు చేపడుతున్నాం అన్నారు.
Read Also: Union Budget 2023: ఎన్నికల వేళ.. కర్ణాటకకు భారీ నజరానా
లోకేష్ పాదయాత్ర ను డైవర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఆయనేమైనా జాతీయ నాయకుడా పాదయాత్ర చేసుకో. బహుముఖ ప్రజ్ఞాశాలి పాదయాత్ర డైవర్ట్ చేయడం.. శతాబ్దపు జోక్ అన్నారు తమ్మినేని సీతారాం. ఎన్నికలకు సిద్దమౌతున్నాం. వచ్చే ఎన్నికలు పార్టీలు, వ్యక్తులు మధ్యకాదు. క్లాస్ వార్… జరగబోతోంది. పెత్తందారులకు – పేదలకు మద్య పోరు. ఎన్నికల కురుక్షేత్రంలో విజయం సాధిస్తాం. మేం తప్పు చేస్తే… గిరిజన దళిత, వెనుకబడిన వర్గాలు క్షమించవు. ఎలాంటి అన్యాయం జరగకుండా జగన్ జాగ్రత్తగా పాలన చేస్తున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని అమరావతిలో పేదలకు ఇళ్ళస్థలం ఇవ్వద్దన్నాడు చంద్రబాబు. చంద్రబాబు నువ్వు క్రిమినల్ వి ముఖ్యమంత్రిగా పనిచేయడం నేరం పాపం. అణగారిన వర్గాల కోసం ఒకేఒక్కడు జగన్ పోరాడుతున్నారు. జనం జగన్ ఒకటైపోయారు.
పేదల కోసం పోరాడే.. కమ్యునిస్ట్ లు సైతం.. అమరావతి లో పేదలకు పట్టాలు పంపిణి ని అడ్డుకోవడం దారుణం. ఇది ఎంతదారుణం.. తప్పు కదా. జగన్ లాంటి గొప్ప నాయకుడు మహా నాయకుడు లేడు రాడు . చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేసారు.. సోనియాతో కుమ్మక్కై.. సింహాన్ని బంధించినట్లు బంధించారు. సింహం బోను లోంచి వచ్చి చీల్చి చీల్చి పడేసింది. విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర వలసలు ఆగుతాయి. కోటంరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. టాపింగ్ కి గురవుతున్నారంటున్న ఎమ్మేల్యేల పేర్లు కోటం రెడ్డి బైటపెట్టాలన్నారు.
Read Also: Organs Theft: ఆస్పత్రికి వస్తే అవయవాలు కొట్టేశారు.. కవర్లు పెట్టి కుట్టేశారు