Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు. ఏయే తేదీల్లో రైళ్లు అందుబాటులో ఉంటాయి.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తాయి అనే వివరాలను ప్రకటించింది.
Read also: Astrology : నవంబర్ 26, శనివారం దినఫలాలు
Also Read
హైదరాబాద్-కొల్లాం (ట్రైన్ నెం. 07133) డిసెంబర్ 5, 12, 19 మరియు 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరిలో కూడా ఇది 2, 9 మరియు 16 తేదీల్లో నడుస్తుంది. కొల్లాం-హైదరాబాద్ (రైలు నంబర్ 07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో నడుస్తుంది. ఈ సేవలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ లాంటి కొన్ని ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగనుంది.
సికింద్రాబాద్-కొట్టాయం (ట్రైన్ నెం. 07125) డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో నడుస్తుంది. అలాగే, కొట్టాయం-సికింద్రాబాద్ సర్వీస్ (ట్రైన్ నంబర్ 07126) డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరి 2, 9. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు వంటి అన్ని ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.
Read also: Delivery Boy Kiss woman : డెలివరీ ఇచ్చాడు.. ముద్దు పెట్టాడు.. ఆ డెలివరీ బాయ్‌ని ఆమె ఏం చేసిందంటే
ఆంధ్రప్రదేశ్ నుంచి..
నర్సాపురం-కొట్టాయం మధ్య (రైలు నంబర్ 07119) డిసెంబర్ 2, 9, 16, 30 , జనవరి 6, 13 తేదీల్లో నడుస్తుంది. అలాగే, కొట్టాయం-నర్సాపురం (ట్రైన్ నంబర్. 07120) డిసెంబర్ 3, 10, 17, 31 తేదీల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 7, 14. పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు సహా అన్ని ప్రధాన స్టేషన్లలో రైలు ఆగుతుంది.
Cold Wave in Adilabad: మళ్ళీ పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి
తాజావార్తలు
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!