DAP Prices: రైతులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈసారి డై–అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP) ధర జనవరి నుంచి పెరిగే అవకాశం ఉంది. 50 కిలోల బ్యాగ్‌పై సుమారు 200 రూపాయల వరకు పెరగనుందని సమాచారం.
BJP New President: జనవరి నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రాల్లోనూ అధ్యక్షులు మారనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ అధ్యక్షుడితో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ పార్టీ తీర్మానం చేసింది.
లోక్‌సభ ఎన్నికల రణరంగం ఊపందుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తుఫానును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ఒకే భారతదేశాన్ని ఏర్పాటు చేసేందుకు 28 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ కూటమిలో సీట్ల పంపకాలపై చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సరంలో విపక్షాల కూటమిలో సీట్ల పంపకంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్ట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 2024 జనవరి 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు. అంతేకాకుండా ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.
శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో మూడో చిత్రంగా విడుదలైన అఖండ.. అఖండమైన విజయాన్ని అందుకొని.. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక రికార్డులను వాసులు చేస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్.. తమన్ మాస్ మ్యూజిక్ అఖండను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లో మాస్ జాతర చూపిస్తున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నదట .. ఇక దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొత్త సంవంత్సరం…