రాయలసీమలో ఆర్థిక వనరులున్నా అభివృద్ధిలేకుండా చేశారు: సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల కోర్కెలు తీర్చడంలో… ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ, వైసీపీ పార్టీలపై విమర్శల దాడులకు దిగారు. రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాయలసీమలో ఎర్రచందనం, ముగ్గురాయి, చాలా ఖనిజాలు ఉన్నప్పటికీ.. ఇక్కడివారు ముఖ్యమంత్రులుగా ఉన్నా అభివృద్ధి లేకుండా చేశారన్నారు. అన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్నా అభివృద్ధి శూన్యమన్నారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామన్నారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ర్టం నిధులు ఇవ్వకున్న మేము పూర్తి చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కడప, కర్నూలులో మోడీ ప్రభుత్వం ఎయిర్‌పోర్టులు నిర్మిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం బస్టాండ్‌లను ప్రయివేట్ పరం చేస్తుందని మండిపడ్డారు. సర్పంచ్‌ల నిధులు వెనక్కి తీసుకుంటున్నారు, ఎన్ ఆర్ఈజీఎస్ నిధులను దారి మళ్లించారన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు మట్టి,ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పోలవరం తప్ప తెలుగు గంగ, హంద్రీనీవా అక్కరలేదా ఎందుకు వీటిపై రెండు పార్టీలు మాట్లాడటం లేదని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.
Read Also: కోర్టులు మొట్టికాయలు వేస్తే కానీ సారుకు బాధ్యతలు గుర్తుకు రావు: షర్మిల
Also Read
రాష్ట్రంలో కేవలం మోడీ ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. సిమెంటును రూ. 330 కి ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 200 ఇస్తామని సోము వీర్రాజు అన్నారు. పిల్లలకు సరైన కోడిగుడ్లు ఇవ్వలేని పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో కోళ్లఫారం పెట్టి నాణ్యమైన నాటి కోడి గుడ్లను సరఫరా చేస్తామన్నారు.పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని భవిష్యత్తులో బీజేపీ పోరాటాలు చేస్తుందన్నారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడు బడ్డా శ్రీకాంత్ రెడ్డి పై దాడి కి నిరసనగా ఈనెల 22 న 175 నియోజకవర్గాల్లో ప్రజా నిరసన సభలు నిర్వహించనున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలపై దాడి చేస్తే అడిగే దిక్కులేదన్నారు. మసీదులు కట్టడం, టిప్పు విగ్రహ ఏర్పాటు… రాముడి శిరక్షేధనం.. రథం తగలబడడం వంటివి జరిగితే అడిగేవారు లేరని, వైఎస్ విగ్రహనికి ఏమైనా జరిగితే వెంటనే అరెస్టులు చేస్తున్నారనిసోము వీర్రాజు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
- Tags
- ap
- bjp
- Rayalaseema
- Somu Veerraju
- tdp
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!