Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna: విజయవాడలో తీవ్ర కలకలం రేపుతున్న సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల అక్రమ ప్రమేయంపై దర్యాప్తు బృందం పక్కా ఆధారాలను సేకరించింది. ముఖ్యంగా సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న మార్కాపురం టూ విజయవాడ ఎపిసోడ్ ఇప్పుడు ఈ విచారణలో అత్యంత కీలకంగా మారింది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ నవీన్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రహస్యంగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకుని, ఎలాంటి అధికారిక రికార్డులు లేకుండా ఒక ప్రైవేట్ వాహనంలో విజయవాడకు తరలించినట్లు ఆధారాలతో సహా నిర్ధారించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం మూడో రోజు విచారణను మరింత తీవ్రతరం చేసింది. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ (ADCP) లతాకుమారి, ఎస్ఐ నవీన్‌లతో పాటు పలువురు కానిస్టేబుళ్లను పిలిపించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. అయితే, అసలు ఎవరి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంత దూరం మార్కాపురానికి వెళ్లారు? దీని వెనుక ఉన్న ఉన్నతాధికారి ఎవరు? అనే కోణంలో దర్యాప్తు అధికారులు నిశితంగా ఆరా తీస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే 24 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ సాగగా, లభించిన క్లూస్ టీమ్ నివేదికలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా మూడో రోజు విచారణను మరింత లోతుగా సాగిస్తున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మరోవైపు నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాస్‌ను నిన్ననే దాదాపు 8 గంటల పాటు విచారించిన దర్యాప్తు బృందం, ఈ రోజు ఆయనను మరోసారి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నిస్తోంది. సాయికృష్ణపై గతంలో నమోదైన కేసులు, ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని అధికారుల పాత్రపై దైవప్రసాద్ బృందం ముమ్మరంగా విచారణ జరుపుతోంది. ఈ కేసు విచారణలో రోజుకో పక్కా ఆధారం దొరుకుతుండటంతో, దీనితో సంబంధం ఉన్న పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దర్యాప్తు ఎటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని కమిషనరేట్ పరిధిలోని పలువురు అధికారులు తీవ్ర టెన్షన్లో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..