Somu Veerraju Sensational Comments On YCP Govt: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా వైసీపీ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గ్రామీణ సడక్ యోజన క్రింద బీజేపీ వేసినన్ని రోడ్లు ఎవరూ వేయలేదన్నారు. ఏం చెప్పడానికి కొందరు రాష్ట్రంలో తిరుగుతున్నారని.. పరోక్షంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కౌంటర్ వేశారు. కొత్తగా రాష్ట్రాన్ని తినేసేందుకు.. పథకాలు ప్రకటించుకుంటున్నారని ఆరోపించారు. తాము మోడీ నాయకత్వంలో రోడ్ మ్యాప్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. వాళ్లతో కలుస్తారా, వీళ్లతో కలుస్తారా అని ఎప్పుడు మమ్మల్నే ఎందుకు ప్రశ్నిస్తారు? అని నిలదీశారు. వారాహి యాత్రను బీజేపీతో కలిసి చేస్తారా? అని పవన్‌ను అడుగుతారా? అని ప్రశ్నించారు. బీజేపీకి ప్రజలతో మాత్రమే పొత్తు ఉందని పేర్కొన్నారు. బీజేపి చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉందా? అని సవాల్ చేశారు. ఏపీలో బీజేపిని ఓ అద్బుత శక్తిలా తీర్చిదిద్దుతామన్న ఆయన.. తమ పాలన అద్భుతంగా ఉందన్నారు. కానీ.. వారి పాలన మొత్తం అవినీతిమయమని ఆరోపించారు. వాళ్లు అవినీతిపరులని, అభివృద్ది లేని వారని, అందిరికీ ఫైన్‌లు వేసేవాళ్లని విమర్శించారు. తాము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. వాళ్లు వేరే వాళ్ల మీద బాంబులు వేసుకుంటారని దుయ్యబట్టారు.
GVL Narasimha Rao: బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. జనసేనతో పొత్తు ఉంది
అంతకుముందు.. కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారని, టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరు చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ పెద్దలతో భేటీ అనంతరం చంద్రబాబు పొత్తుల అంశం ప్రస్తావించలేదని గుర్తు చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నదే తన కోరిక అన్నారు. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమం.. రాష్ట్ర ప్రజలందరికీ తెలసుని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్, ముద్రగడ పద్మనాభం మధ్య వివాదంపై వివాదాన్ని రాజకీయంగా మాత్రమే చూడాలని.. కులపరంగా చూడకూడదని సూచించారు.
Pawan Kalyan: కుల రాజకీయాలతో వ్యవస్థ నాశనమౌతోంది.. జనసేనాని ఫైర్