చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు.. అవసరమైనప్పుడే మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు అని ఎద్దేవా చేసిన ఆయన.. అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్దుడు అని వ్యాఖ్యానించారు.. గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా లవ్ చేశారని.. చంద్రబాబు అవకాశవాది.. అవసరమైనప్పుడు లవ్ చేస్తారు.. ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో నేను చెప్పలేను అని హాట్ కామెంట్లు చేశారు. ఇక, జనసేన పార్టీ మా మిత్రపక్షం అని మరోసారి స్పష్టం చేశారు సోము వీర్రాజు..
Read Also: ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్.. డేంజరే..!
Also Read
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీకి పంజాబ్‌లో ఎదురైన ఘటనపై స్పందించిన ఆయన.. ప్రధాని మోడీ భద్రతకు భంగం వాటిల్లింప చేసేలా పంజాబ్‌లో పరిస్థితులు సృష్టించారిన మండిపడ్డారు.. ప్రధాని విషయంలో జరిగిన వ్యవహారంపై నిరసనలు తెలియచేస్తాం… ఈ విషయంలో ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కూడా కలవున్నట్టు వెల్లడించారు సోము వీర్రాజు. కాగా, ఏపీలో దూకుడు పెంచింది బీజేపీ.. వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తోంది. ఇదే, సమయంలో.. చంద్రబాబే ఓ ప్లాన్ ప్రకారం.. ఈ సభలు పెట్టిస్తున్నారని.. బీజేపీ సభల వెనుక టీడీపీ ఉందంటూ అధికార వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు, కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు బహిరంగ సభలో ఓ ప్రశ్న ఎదురైంది.. వచ్చే ఎన్నికల్లో.. మీరు జనసేనతో కలిసి పనిచేస్తారా? అని ఓ యువకుడు ప్రశ్నించాడు.. దీనికి బదులిచ్చిన బాబు.. అదే తమ్ముడు నీవు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావే అనుకో.. అది సరిపోదు.. రెండు వైపుల నుంచి కూడా లవ్ ఉండాలంటూ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!