AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
- 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,457 మంది అభ్యర్థులు
- 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 మంది పోటీ
- ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన
- మున్సిపల్ ఎన్నికలకు నవంబర్ 1న పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. అప్పీళ్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, పరిశీలన అనంతరం మొత్తం 46,457 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. ఇక పరిషత్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన జెడ్పీటీసీ స్థానాల విషయానికి వస్తే.. మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు గాను 4,770 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలిచారు. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ప్రచార పర్వం వేడెక్కుతోంది.
Also Read
- Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న 'అర్నాబ్'.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Bhumana Karunakar Reddy: నంద్యాల ఘటనలో ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భూమన ప్రశ్నలు
- Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
- Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
నామినేషన్ల పరిశీలన , ఆమోదం ప్రక్రియ ప్రకారం ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీ , జనసేన అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దక్కించుకున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి టీడీపీ నుంచి 19,760 మంది, వైఎస్సార్సీపీ నుంచి 17,726 మంది, అలాగే జనసేన తరఫున 4,330 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇక జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి టీడీపీ నుంచి 1,693 మంది, వైఎస్సార్సీపీ నుంచి 1,445 మంది, , జనసేన నుంచి 587 మంది అభ్యర్థులు అధికారికంగా బరిలో నిలిచారు.
ఎన్నికల షెడ్యూల్లో భాగంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 1వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. మరోవైపు, ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల తేదీల మార్పు అలాగే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక పోరులో గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.
తాజావార్తలు
-
AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?