ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్.. డేంజరే..!

ఇప్పుడు ప్రపంచ దేశాలకు కరోనా మహమ్మారి పెద్ద సవాల్‌గా మారుతోంది.. ఓవైపు క్రమంగా డెల్టా, డెల్టా ప్లస్‌ కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కూడా టెన్షన్‌ పెడుతోంది.. క్రమంగా కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇదే సమయంలో ఒమిక్రాన్‌ మృతుల సంఖ్య కూడా పెరుగుతూ కలవరానికి గురిచేస్తోంది.. ఒమిక్రాన్‌పై మరోసారి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).

Read Also: కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్‌లోనా? ఫామ్‌హౌస్‌లోనా?

ఒమిక్రాన్‌ కూడా డేంజరే అని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఒమిక్రాన్‌ సోకినవాళ్లు కూడా ఆస్పత్రుల్లో చేరుతున్నారని పేర్కొంది.. ఇక, కరోనా వేరియంట్లలో ఇదే చివరి వేరియంట్‌ అని చెప్పలేం అంటూ మరో బాంబ్‌ పేల్చిన డబ్ల్యూహెచ్‌వో.. వారం వ్యవధిలో 71 శాతం ఒమిక్రాన్‌ కేసులు పెరిగినట్టు వెల్లడించింది.. అందువలన ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. అందరూ కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ.. తప్పనిసరిగా మాస్క్‌ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని మరోసారి స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్‌వో.

Related Articles

Latest Articles