CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
- అక్టోబర్ 28న బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
- గంటకు 140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం
- గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని ఆదేశం
- ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్నబ్ తుఫాను నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్దత, ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో యంత్రాంగం పని చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి…ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి అని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అవసరమైన సూచనలు చేయాలని ఆదేశించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదు…ఆస్తి నష్టం సాధ్యమైనంత తగ్గించాలని సిఎం సూచించారు. ప్రజల ఫోన్లకు నిరంతరం సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయండి…. ప్రభుత్వ సూచనలు పాటించేలా తీర ప్రాంతాల్లో గ్రామాల ప్రజలను ఒప్పించండి అని సిఎం చంద్రబాబు సూచించారు. శాటిలైట్ల సమాచారంతో, సైంటిఫిక్ డేటా ఆధారంగా చర్యలు తీసుకోవాలి అన్నారు.
గర్భిణీలను ముందే ఆసుపత్రులకు తరలించాలి
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…‘తుఫాను వల్ల గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది….. విద్యుత్ శాఖ పూర్తి సన్నద్దతతో ఉండి విద్యుత్ పునరుద్దరణ వేగంగా జరిగేలా చూడాలి. సముద్రంపై వేటకు వెళ్లిన అన్ని బోట్లు తీరానికి వచ్చేలా చూడాలి. భారీ వర్షాలతో వచ్చే వరదతో నీటి వనరులను నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు ఇరిగేషన్ శాఖ తీసుకోవాలి. జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యంగా అన్ని స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. ఒక సారి తుఫాను ప్రభావం మొదలై రాకపోకలకు ఆటకం కలిగితే గర్భిణీలు ఇబ్బందులు పడతారు. ఈ వారంలో కాన్పులు అయ్యే గర్భిణీలను ముందుగానే ఆసుపత్రికి తరలించాలి. తాగునీరు, ఆహారం పూర్తి స్థాయిలో సిద్దం చేసుకోవాలి. వీటికి నిధుల కొరత లేకుండా కలెక్టర్లు చూసుకోవాలి. పునరావాస కేంద్రాల్లో వసతులు, సౌకర్యాలు ఉండాలి. తుఫాను ప్రభావిత ప్రాంతం ప్రజల నుంచి చిన్న ఫిర్యాదు కూడా రాకూడదు. సెల్ ఫోన్ నెట్వర్క్ దెబ్బతింటే వెంటనే పునరుద్దరించేలా ఏజెన్సీలను సిద్దం చేయాలి. ఈ విషయంలో జాప్యాన్ని సహించవద్దు’ అని ఆదేశించారు. సివిల్ సప్లై, మునిసిపల్, పంచయతీ రాజ్, విద్యుత్, హోం, ఫైర్, వ్యవసాయ శాఖ అధికారులు తుఫాను సన్నద్దత చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు.
Also Read
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
- AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
- AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
- CII Partnership Summit 2026: ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. రెండో రోజు రూ.1.41 లక్షల కోట్ల ఒప్పందాలు..
విశాఖ -బాపట్ల మధ్య 28వ తేదీన తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అక్టోబర్ 28 మధ్యాహ్నానికి బాపట్ల – విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల్లో కోనసీమ–యానాం–కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 930 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా ఉంది. అక్టోబర్ 26 ఉదయానికి తుఫానుగా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా, 27న అతి తీవ్ర తుఫానుగా బలపడుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 115 – 125 కిలోమీటర్ల వేగంతో గాలులు…కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి నాలుగు గంటలకు తుఫానుపై బులిటెన్ విడుదల చేయాలని సిఎం సూచించారు.
భారీ, అతి భారీ వర్షాలు
అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపైనా గాలులు, వర్ష ప్రభావం ఉంటుంది. అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 292.55 మి.మీ., అల్లూరి సీతారామరాజు జిల్లాలో 281.17 మి.మీ., విశాఖపట్నంలో 253.87 మి.మీ., శ్రీకాకుళంలో 249.18 మి.మీ. వర్షపాతం పడవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు మొత్తం వర్షపాతం 95 మి.మీ.గా ఉంటుందని అంచనా వేయగా…ప్రభావిత జిల్లాల్లో సగటున 22–29 సెం.మీ వర్షపాతానికి అవకాశం ఉందని అధికారులు వివరించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, జిల్లా కలెక్టర్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు, వ్యవసాయం, విద్యుత్, ఇరిగేషన్, హోం, వైద్య ఆరోగ్య, పౌర సరఫరాలు, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Sonia Gandhi Book: బాబ్రీ తాళాలు తెరవడం వెనక రాజీవ్ గాంధీ వ్యూహం.. రామమందిర రాజకీయాలపై సోనియా కీలక విషయాలు..
-
Telangana El Nino Impact : ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ అలర్ట్.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.!
-
Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
-
Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
-
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?