ఏపీలో వైసీపీ సర్కారుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. సంపూర్ణ మద్యనిషేధం అన్నవాళ్లు సారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు . మద్యం రేట్లు పెంచి సామాన్యులను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని సోము వీర్రాజు మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రూ.70కే చీప్ లిక్కర్ అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రెవెన్యూ బాగుంటే రూ.50కే చీప్ లిక్కర్ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: అమరావతిలోనే బీజేపీ ఆఫీస్.. స్పష్టం చేసిన సోము వీర్రాజు
మరోవైపు వైసీపీ ప్రభుత్వమే పచ్చి సారా కాస్తోందని సోము వీర్రాజు విమర్శలు చేశారు. బూమ్ బూమ్ బీర్లంట.. పాపం కింగ్ ఫిషర్ బీర్లు ఏమయ్యాయో తెలియదంటూ ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో జగన్ సంక్షోభం సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి అధికారమిస్తే మూడేళ్లలో రాజధానిని నిర్మిస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆరునూరైనా అమరావతిలోనే రాజధాని ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.