ఏపీలో కోనసీమ అల్లర్లు హాట్ టాపిక్ అవుతోంది. అల్లర్లు జరిగి వారం అవుతున్నా ఇంకా అక్కడ అలజడి చల్లారలేదు. అంబేద్కర్ పేరుని చాలా చోట్ల పెట్టినా.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఎందుకు గొడవలు జరిగాయి..? బీజేపీ 42 చోట్ల అంబేద్కర్ పేరు పెట్టినా గొడవలు రాలేదు.. కోనసీమలో ఎందుకు గొడవలు జరిగాయి..? అని ప్రశ్నించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
కేవలం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయంలో భాగంగానే కోనసీమలో గొడవలు జరిగాయి.కొన్ని వర్గాలను కావాలనే రెచ్చగొడుతున్నారు. మంత్రి ఇల్లు తగులబెడితే హోం మంత్రి, డీజీపీ వెళ్లి పరిశీలించరా..? కోనసీమ ఘటనపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకోదా..? రిటైర్డ్ జడ్జీతో కోనసీమ విధ్వంసంపై ఎందుకు విచారణ జరపరు..? అన్నారు.
కోనసీమ మొత్తం వెంటనే ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించాలి. గోదావరి గర్జన పేరుతో రాజమండ్రిలో ఈ నెల 7వ తేదీన నడ్డా ముఖ్య అతిథిగా బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమం కంటే.. నరేంద్ర మోడీ ఇచ్చే సంక్షేమమే ఎక్కువ. నవ రత్నాలు ఎక్కువ..? నరేంద్ర మోడీ ఎక్కువ..? మోడీ పాలనలోనే అభివృద్ధి ఉంది.. రాష్ట్రంలో అభివృద్ధి లేదని విమర్శించారు.
కేంద్రంలో అవినీతి లేదు.. రాష్ట్రంలో ఎక్కడా చూసినా అవినీతే.అనేక వర్గాలకు సంక్షేమం అందేలా కేంద్రం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది.నరేగా, ఈ-శ్రామ్ కార్డులు, జన్ ధన్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, ఆత్మ నిర్బర్ భారత్ వంటి ఎన్నో పథకాల ద్వారా ఎంతో లబ్ది చేకూరుస్తున్నాం.గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇళ్లు 20 లక్షలైతే.. కట్టినవి మాత్రం కేవలం 40 వేలు మాత్రమే.రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సరిగా ఇవ్వకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
సర్పంచులకు కేంద్రం నేరుగా నిధులు వేస్తోంటే.. ఆ నిధులనూ సీఎం మళ్లిస్తున్నారు.ఆత్మకూరులో మేం పోటీ చేస్తున్నాం.మేమే రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం. బద్వేలులో జనసేన మద్దతిచ్చింది.. ఆత్మకూరులో జనసేన మద్దతు విషయమై చర్చిస్తున్నాం అని తెలిపారు సోము వీర్రాజు.
YCP : పిఠాపురం వైసీపీలో కొత్త రగడ.