రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం బీజేపీ పార్టీ కార్యాలయానికి విచ్చేసి నాయకులు కార్యకర్తలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ నిన్న మహా శివరాత్రి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శివ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసిపి అఫీషియల్ ట్విట్టర్ లో జగన్ అభ్యంతరకర దుస్తులు ధరించి శివతత్వం గురించి ట్విట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు.
అలాంటివి పోస్ట్ చేసే నైతిక అర్హత వైసీపీ పార్టీకి గానీ ముఖ్యమంత్రికి కాని లేదన్నారు. హిందువులకు సీఎం జగన్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలోని శివాలయాల ఎదుట నిరసన దీక్షలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈమధ్య బీజేపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని హాస్టళ్ళను సందర్శించారని ప్రహరీ గోడలు లేక హాస్టల్ లలో పందులు కుక్కలు తిరుగుతున్నాయన్నారు. హాస్టళ్ళల్లోని ఆడపిల్లలు ఆహారం లేదని బయటికి రావడం జరిగిందన్నారు. జగన్ పరిపాలనలో హిందువులకు అనేక రకాల అవమానాలు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్రంలో అంతర్వేదిలో రథం దగ్ధం జరిగితే ఇంతవరకు ద్రోహులను శిక్షించలేదన్నారు. అలాగే, విజయనగరంలో రాముడు విగ్రహానికి శిరచ్చేదనం జరిగితే ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను ఆదాయ వనరులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు.
Read Also: Taraka Ratna – NTR : ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్న తారకరత్నకు అండగా నిలిచిన ఎన్టీఆర్