Somu Veerraju: జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తాం.. అధికారమిస్తే ఐదేళ్లలో రాజధాని కట్టి చూపిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై అప్పుడే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.. ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన.. కలిసి నడవాలని భావిస్తున్నాయి.. అయితే, ఇదే సమయంలో టీడీపీ పొత్తు విషయంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో.. జనసేన స్టాండ్ ఒకలా ఉంటే.. బీజేపీ స్టెప్పు మరోలా కనిపిస్తోంది.. ఈ సమయంలో పొత్తుల విషయంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాం.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశం ఆలోచిస్తున్నాం అన్నారు.. ఇక, జనసేనతోనే బీజేపీ పొత్తులో ఉంది.. జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు సోము వీర్రాజు..
Read Also: JC Prabhakar Reddy: అధికారులంతా కేసుల్లో ఇరుక్కుంటారు.. జేసీ వార్నింగ్
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
ఇక, ముందు నుంచి చెబుతున్నాం.. కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకం అన్నారు సోము వీర్రాజు.. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారమిస్తే ఐదేళ్లలో రాజధాని కట్టి చూపిస్తామని హామీ ఇచ్చారు.. ఇప్పటికే అమరావతి రాజధాని కోసం నిధులు ఇచ్చాం.. రుణాలు ఇప్పించామని గుర్తుచేశారు.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోనే ప్రజల్లోకి వెళ్తామని.. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. విశాఖను అభివృద్ధి చేశాం.. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.. మరోవైపు.. పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ.. బీజేపీ రాస్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుపై చేసిన వ్యాఖ్యల విషయంలో నో కామెంట్ అంటూ దాటవేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!