దశాబ్ధం క్రితం పోలియో వైరస్ నుంచి దేశం నుంచి తరిమేశాం. దేశంలోని పోలియో పట్ల అవగాహన కల్పించడంతో విధిగా చిన్న పిల్లలకు చుక్కల మందు వేయిస్తున్నారు. దీంతో పోలియో సోకే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీంతో పోలియో ఫ్రీ కంట్రీగా ఇండియా తయారైంది. 2011లో వెస్ట్ బెంగాల్ హౌరాకు చెందిన 12 ఏళ్ల బాలికకు చివరిసారిగా పోలియో సోకింది. భారత దేశం మార్చి 27, 2014న పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది.
ఇదిలా ఉంటే తాజాగా దాదాపుగా పదేళ్ల తరువాత మరోసారి ఇండియాలో పోలియో వైరస్ వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో మెటియాబురుజ్ ప్రాంతంలోని ఓ మురుగు కాల్వలోని నీటిలో పోలియో వైరస్ ను గుర్తించారు. యునిసెఫ్, భారత ఆరోగ్య శాఖ చేసిన సంయుక్త పరిశోధనల్లో ఈ వైరస్ ఉనికి బయటపడింది.
దీంతో రాష్ట్రంలో ఉన్న అన్ని వైద్య కళాశాలలు, ప్రభుత్వం ఆసుపత్రులను అధికారులు అప్రమత్తం చేశారు. పోలియో వైరస్ అనవాళ్లు దొరికిన తర్వాత మెటియాబురుజ్ ప్రాంతంలో ఎక్కడా కూడా బహిరంగ మలవిసర్జన చేయరాదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆసుపత్రులు, వైద్య కళాశాలలను ఆదేశించింది. పిల్లల మలవిసర్జనను పరీక్షించాలని కోరింది. టీకాలు వేయడంపై దృష్టి పెట్టాలని కోరారు.అయితే కరోనా పాండిమిక్ లాక్ డౌన్ల కారణంగా ఇటీవల పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం నెమ్మదించింది. తాజాగా మరోసారి వ్యాక్సిన్ వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.