రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ బాధ్యత ఈ ఏడాది నుంచి మరింతగా పెరుగుతుందన్నారు. వైసీపీ పాలనకు 30 నెలలు పూర్తియిందన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ వందకు వందశాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. క్యాలెండర్ డేట్స్‌తో సహా అన్ని పథకాలను చెప్పినవాటి చెప్పినట్టుగా పూర్తి చేశామన్నారు.
Read Also:ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సజ్జనార్ గుడ్‌న్యూస్
1.6 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి చెల్లింపులు చేశామన్నారు. అవినీతికి ఆశ్రిత పక్షపాతం లేకుండా అర్హత ఉన్న లేకున్నా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మేలు చేసిందన్నారు. ఉద్యోగాల కల్పన ఒక ట్రెండ్ సెట్టర్ అయినా మేము పెద్దగా ప్రచారం చేసుకోలేకపోతు న్నామన్నారు. మా బాధ్యతగా చేశాం తప్ప ఎప్పుడు డబ్బా కొట్టుకునే ఉద్దేశమే లేదని సజ్జల అన్నారు.