Sajjala: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఆ విషయం మాత్రం స్పష్టమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్‌లపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. రాజకీయాల్లో సీరియస్‌గా ఉన్నవాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తారని.. కానీ విశ్లేషకుడిగా పవన్ కళ్యాణ్ ఆప్షన్లు మాత్రమే చెప్పారని సజ్జల ఆరోపించారు. జనసేన తన పార్టీ అని పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్లు ఉన్నారని సజ్జల చురకలు అంటించారు. బీజేపీ వస్తుందో లేదో కానీ టీడీపీతో వెళ్ళటం ఖాయమని పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు గేమ్ ప్లాన్ ప్రకారమే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని సజ్జల విమర్శలు చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకునేందుకే ఈ పొత్తుల వ్యాఖ్యలు చేశారన్నారు. టీడీపీ నేతలే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానంటోంది లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సజ్జల గుర్తుచేశారు.
LIVE: ఏపీ పాలిటిక్స్ ని డిసైడ్ చేసే శక్తి పవన్ కళ్యాణ్ లో ఉందా..?
Also Read
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యల్లో డొల్లతనం బయట పడిందని.. పథకాల్లో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం ఇస్తోంది ఎంత అన్నది చూడాలని సజ్జల హితవు పలికారు. తాము మాత్రమే చేస్తున్నాం.. రాష్ట్రం ఏం చేయటం లేదు అనటం తప్పు అని సజ్జల వ్యాఖ్యానించారు. మరోవైపు పదో తరగతి ఫలితాలపై ప్రతిపక్షాల విమర్శలు సరికాదని సజ్జల అభిప్రాయపడ్డారు. నారాయణ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఫలితాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సీరియస్‌గా పరీక్షలు ఎలా నిర్వహించాలో అలాగే నిర్వహించడం కూడా ఎక్కువ మంది పాస్ కాకపోవడానికి కారణమన్నారు. కోవిడ్ కూడా కొంత ప్రభావం చూపించిందన్నారు. టీడీపీ దేన్ని తప్పుబడుతుందో అర్థం కావడం లేదని.. పరీక్షలు ఉండాలా వద్దా లేకపోతే పదో తరగతి కూడా అందరినీ పాస్ చేసి పంపించేయాలా అని ప్రశ్నించారు. నారాయణ, చైతన్య వంటి విద్యాసంస్థలు టీడీపీ హయాంలో ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చాయని.. అందుకే 90కి పైగా ఉత్తీర్ణత సాధారణంగా కనిపించిందన్నారు. కాపీ కొట్టడానికి అవకాశం ఉండే బిట్ పేపర్ తీసేయటం కూడా పాస్ పర్సంటేజ్ తగ్గడానికి ఒక కారణం అని చెప్పవచ్చని ఎన్టీవీతో సజ్జల మాట్లాడారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!