Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sajjala Ramakrishna Reddy Challenge To Chandrababu About Elections

Sajjala: రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చే దమ్ము.. చంద్రబాబుకు ఉందా?

Published Date :June 1, 2022 , 7:35 pm
By Ramesh Nalam
Sajjala: రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చే దమ్ము.. చంద్రబాబుకు ఉందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమరావతి: ప్రతిపక్ష పార్టీ టీడీపీపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు నుంచి టీడీపీ నేతలకు కడుపు మంట ఎక్కువైందని ఆయన ఎద్దేవా చేశారు. మహానాడు ఘన విజయం అంటూ వాళ్ళకి వాళ్లే బుజాలు చరుచుకుంటున్నారని చురకలు అంటించారు. టీడీపీ నేతలు ఎంతటి పతనావస్థలో ఉన్నారనేది వారి ఏడుపు వల్లే కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు. ఏడుపు వాళ్ళ అధికారిక గీతం అయ్యిందని.. అసెంబ్లీ నుంచి చంద్రబాబు ఏడుపు ప్రారంభమైందని సజ్జల విమర్శించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధికారంలో సీఎం జగన్ వాటా ఇవ్వడం, కృతజ్ఞతతో బస్సు యాత్రకు ప్రజలు జైజైలు పలికితే చంద్రబాబుకు ఏడుపు వస్తుందని సజ్జల వ్యాఖ్యానించారు. కరోనా వల్ల ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తిన్నా సంక్షేమాన్ని అమలు చేసిన నాయకుడు జగన్ అని ఆయన తెలిపారు. సీఎం జగన్‌ దావోస్‌ పర్యటనపైనా టీడీపీ విష ప్రచారం చేసిందని సజ్జల ఆరోపించారు. బీసీ మంత్రుల బస్సు యాత్రను చూసి ఓర్వలేకపోయారన్నారు. మహానాడులో అన్నీ అబద్ధాలే చెప్పారని ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు దావోస్ వెళ్తే ఆహా ఓహో అన్నట్లు బిల్డప్ ఇచ్చారని.. కానీ దావోస్‌నే రాష్ట్రానికి తెస్తానంటూ జగన్ ఏనాడూ బిల్డప్‌లు ఇవ్వలేదని సజ్జల గుర్తుచేశారు. దావోస్‌లో జరిగిన ఒప్పందాలపై కూడా టీడీపీ నేతలు ఏడుస్తున్నారంటూ విమర్శించారు. 14 సార్లు దావోస్ వెళ్లిన చంద్రబాబు ఏం తీసుకొచ్చాడని నిలదీశారు.

టీడీపీ నేతలతో ప్రశ్నించుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ దిగజారలేదని సజ్జల అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికీ మీకు ఇది ఇచ్చాం అని చెబుతున్న ధీమా టీడీపీ నేతలకు ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు. ఆనాడు రుణమాఫీ గురించి ఎన్నికల కమిషన్ అడిగితే ఎలాగోలా చేస్తాం అన్నారని.. ఆ తర్వాత కోత వేసి రైతులను మోసం చేశారని సజ్జల ఆరోపించారు. ఒక పరిణితి చెందిన నాయకుడిలా జగన్ వ్యవహరిస్తున్నారని.. ఇంత వరకు జగన్ దావోస్ వెళ్లి వచ్చాక ఒక్క మాట మాట్లాడలేదని.. అదేమన్నా అంటే ఇండియన్ కంపెనీ అంటారు… ఇండియన్ కంపెనీలవి డబ్బులు కావా అని సజ్జల ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కేవలం నగదు బదిలీ ద్వారా లక్ష కోట్లకు పైగా ఇచ్చిందన్నారు. అన్నా క్యాంటీన్, చంద్రన్న కానుక పథకాలను ఎత్తేశామంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని.. చంద్రన్న కానుక పథకాన్ని హెరిటేజ్ కోసమే పెట్టుకున్నారని సజ్జల ఎద్దేవా చేశారు.

CM Jagan: అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వార్ వన్ సైడే అంటాడని.. ఒంటరిగా రావయ్యా అంటే మాత్రం నోరు మెదపడని సజ్జల విమర్శించారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో టీడీపీకి దమ్ముంటే అభ్యర్థిని పెట్టాలని.. అప్పుడు ప్రజలు ఎవరిని ఆమోదిస్తున్నారో తేలిపోతుందన్నారు. రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సజ్జల సవాల్ విసిరారు. ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ అమలు చేయని పథకాలు ఏవైనా ఉంటే చంద్రబాబు చూపించాలన్నారు. దాదాపు 95 శాతం అమలు చేశామని.. ఇంకా 5 శాతం మాత్రమే చేయాల్సినవి ఉన్నట్లు తెలిపారు. టీడీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము మూడేళ్లలో చేసి చూపించామని.. రానున్న రెండేళ్లలో మరింత ముందుకు వెళ్తామన్నారు. అక్రమాలు చేస్తే ప్రభుత్వానికి రెవిన్యూ రాదని.. కానీ తమ హయాంలో రెవెన్యూ పెరిగిన విషయంపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

మద్యపానాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. జగన్ బెల్టు షాపులు తీసేసి రెవిన్యూ పెంచారని.. కానీ చంద్రబాబు బెల్ట్ షాపులు పెట్టినా రెవెన్యూ రాలేదన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తామని ఆనాడు చంద్రబాబు చేసిందేంటో అందరికీ తెలుసన్నారు. ఎంవోయూలు కేవలం ఒప్పందాలు మాత్రమే అని.. వాటినే ఆధారంగా తాము తీసుకోదల్చుకోలేదన్నారు. భవిష్యత్తులో వాటిని అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఉందని సజ్జల అభిప్రాయపడ్డారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • sajjala ramakrishna reddy
  • YSRCP

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions