south central railway announced special trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. సికింద్రాబాద్-అగర్తల-సికింద్రాబాద్, రామేశ్వరం-సికింద్రాబాద్ మధ్య 52 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 15, 22, 29, సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్-అగర్తల మధ్య 07030 నంబరు గల రైలును నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి సోమవారం సికింద్రాబాద్‌లో సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరనున్న ప్రత్యేకరైలు గురువారం ఉదయం 3 గంటలకు అగర్తల చేరనుంది. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 19, 26, సెప్టెంబరు 2,9,16,23,30 తేదీల్లో అగర్తల-సికింద్రాబాద్ మధ్య 07029 నంబరు గల రైలు నడవనుంది. ప్రతి శుక్రవారం ఉదయం 6:10 గంటలకు అగర్తలలో బయలుదేరనున్న ప్రత్యేకరైలు ఆదివారం సాయంత్రం 4:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
Read Also: Govt Jobs: శుభవార్త.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి
మరోవైపు సికింద్రాబాద్- రామేశ్వరం మధ్య ఆగస్టు 24,31, సెప్టెంబరు 7,14,21,28, అక్టోబర్ 5,12,19,26, నవంబర్ 2,9,16,23,30 డిసెంబర్ 7,14,21,28 తేదీల్లో 07685 నంబరు గల ప్రత్యేకరైలు నడుస్తుందన్నారు. బుధవారం రాత్రి 7.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు గురువారం రాత్రి 11:40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. రామేశ్వరం- సికింద్రాబాద్ మధ్య 07686 నంబరు గల రైలు ఆగస్టు 26, సెప్టెంబరు 2,9,16,23,30, అక్టోబర్ 7,14,21,28 తేదీల్లో, నవంబర్ 4,11,18,25, డిసెంబర్ 2,9,16,23,30 తేదీల్లో నడవనున్నట్లు దక్షిణ మద్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 8:50 గంటలకు రామేశ్వరం నుంచి బయలుదేరనున్న ప్రత్యేకరైలు శనివారం మధ్యాహ్నం 12:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాగా ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్‌తో పాటు సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు ఉంటాయి.