Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Rs 16 Lakh Fraud With Name Of Kidney Rs 7 Crore

Cyber Crime: కిడ్నీకి రూ.7 కోట్ల ఆఫర్‌.. విద్యార్థిని నుంచి లక్షలు దోచేశారు..!

Published Date :December 12, 2022 , 8:25 pm
By Sudhakar Ravula
Cyber Crime: కిడ్నీకి రూ.7 కోట్ల ఆఫర్‌.. విద్యార్థిని నుంచి లక్షలు దోచేశారు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈజీ మనీ కోసం కొందరు షాట్‌కట్స్‌ వెతుకుతుంటారు.. త్వరగా డబ్బులు సంపాదించాలి.. లక్షాధికారిని అయిపోవాలి.. కోటీశ్వరుడిగా పేరు తెచ్చుకోవాలి.. ఇలా ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు.. అయితే, వీరికంటే అడ్వాన్స్‌డ్‌గా సైబర్‌ నేరగాళ్లు ఉన్నారనే విషయాన్ని మర్చిపోతారు.. ఈజీగా వారి వలలో చిక్కుకుని ఉన్నకాడికి సమర్పించుకుంటారు.. తాజాగా, గుంటూరు జిల్లాలో కిడ్నీకి రూ.7 కోట్ల ఆఫర్‌ కలకలం సృష్టించింది.. ఆన్‌లైన్‌లో ఉన్న సమయంలో.. కిడ్నీ అమ్మితే భారీగా డబ్బులు వస్తాయనే ఓ లింక్‌ చూసిన ఇంటర్‌ విద్యార్థిని.. ఆ లింక్‌ క్లిక్‌ చేసి తన వివరాలు పొందుపర్చింది. .ఇక, కిడ్నీ అమ్మితే రూ. 7 కోట్లు ఇస్తామని సైబర్ నేరగాళ్లు ఆ యువతికి ఆఫర్ ఇచ్చారు. అలా సైబర్ నేరగాళ్లు.. ఆ విద్యార్థితో పరిచయం చేసుకున్నారు. ఫేక్‌ అకౌంట్ చూపి మూడు కోట్ల రూపాయాలు బాధిత యువతి ఖాతాలో జమ చేసినట్లు చూపించారు.

Read Also: Jio 5G: గుడ్‌న్యూస్‌ చెప్పిన జియో.. యూజర్లకు ఇక పండగే..!

అయితే, అక్కడే అసలు రూపాన్ని బయటపెట్టారు కేటుగాళ్లు.. ఆ డబ్బులు రిలీజ్ కావాలంటే తమకు నగదు పంపాలని చెప్పారు. దీంతో విద్యార్థినిని విడతల వారిగా.. సైబర్‌ మోసగాళ్లకు రూ.16 లక్షలు పంపింది.. డబ్బులు ఇస్తామని ఢిల్లీకి రావాలని చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్లారు. అయితే, తాను మోసం పోయినట్లు తెలుసుకున్న విద్యార్థినిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని విద్యార్థినిని విజ్ఞప్తి చేసింది.. అయితే, ఈ కిడ్నీ ఆఫర్‌పై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన యువతి.. తాను ఎలా మోసపోయానో వివరించింది.. తాను నాన్నకు తెలియకుండా.. రూ.80 వేలు వాడుకున్నాను.. అయితే, ఆ మొత్తాన్ని మళ్లీ నాన్న ఖాతాలో వేయాలనుకున్నాను.. ఈ సందర్భంలోనే కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయని తెలుసుకుని.. దాని కోసం వెతికానని దాందో.. కిడ్నీ డొనేటెడ్‌ యాప్‌ తగిలిందన్నారు..

ఇక, వాళ్లు లీగల్‌ చార్జీలు, ఇతర ఖర్చులు ఇలా.. వాళ్లు అడిగినప్పుడల్లా డబ్బులు చెల్లిస్తూ పోయా.. మొత్తం రూ.16 లక్షలు వారికి ఇచ్చానని వెల్లడించింది విద్యార్థిని.. మా నాన్న ఇంటి నిర్మాణం కోసం రూ.20 లక్షలు బ్యాంకు ఖాతాలో వేసుకున్నారు.. ఆ డబ్బుల నుంచి సైబర్‌ నేరగాళ్లు అడిగినప్పుడల్లా వేస్తూ.. మొత్తంగా రూ.16 లక్షలు పోగొట్టుకున్నట్టు ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.. ఎవరైనా ఈజీగా మనీ సంపాదించేందుకు ప్రయత్నించొచ్చు.. కానీ, ఇలా తప్పుడు మార్గాల్లో వెళ్లి.. సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కడంతో.. ఉన్నది, ఉంచుకున్నది.. మొత్తం పోగొట్టుకోవడం ఖాయం.. రోజు తరహాలో మోసాలకు పాల్పడుతోన్న కేటుగాళ్లు.. ఈ విధంగానైనా.. మీ నుంచి డబ్బులు లాగేసే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త..

https://www.facebook.com/NtvTeluguLive/videos/1328824477942440/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cyber crime
  • Cyber fraud
  • fraud
  • Kidney Fraud

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions