తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. అన్నీ ఫ్రీ అంటూ టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ సంస్థ.. ఆ తర్వాత.. కొత్త ప్లాన్స్ తీసుకొస్తూ.. చార్జీలు వడ్డించినా.. నెట్ స్పీడ్, నెట్‌వర్క్ లాంటి అంశాలు.. ఆ సంస్థకు కోట్లాది మంది యూజర్లను సంపాదించింది పెట్టింది.. ఇక, ఇప్పుడు దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణపై దృష్టిసారించిన ఆ సంస్థ.. ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.. భారత్‌లో వన్ ప్లస్ – జియోలు లేటెస్ట్ 5జీ టెక్నా లజీ నెట్వర్క్ పై కలిపి పనిచేసేలా ఒప్పందం ఎదుర్చుకున్నాయి.. 5జీ స్వతంత్ర సాంకేతికతను తీసుకురావడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి..
Read Also: MLC Kavitha : దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదు
ఒప్పందంలో భాగంగా జియో సంస్థ.. వన్ ప్లస్‌కు సంబంధించిన వన్ ప్లస్ 9 ప్రో, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ఆర్టీ’తో పాటు వన్ ప్లస్ 10 ప్లస్, వన్ ప్లస్ 9 ఆర్, వన్ ప్లస్ 8 సిరీస్‌లోని నార్డ్, నార్డ్ 2టీ, నార్డ్ 2, నార్డ్ సీఈ, నార్డ్ సీఈ2, నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్లలో జియో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి తెచ్చే పనిలో పడిపోయాయి.. ఈ నేపథ్యంలో.. డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 18వ తేదీ వరకు వన్‌ప్లస్ యానివర్సరీ సేల్ ప్రకటించింది. ఈ సేల్లో అర్హులైన వన్ ప్లస్, జియో 5జీ వినియోగదారులకు రూ.10,800 క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.. అంతేకాదు.. మొదటి 1000 మంది లబ్ధిదారులు అదనంగా రూ. 1499 విలువైన రెడ్ కేబుల్ కేర్ ప్లాన్ మరియు రూ. 399 విలువైన జియో సావ్న్ ప్రో ప్లాన్‌ను కూడా అందిస్తారు..
ప్రస్తుతం, రిలయన్స్ జియో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణెలో 5జీ స్వతంత్రంగా సేవలను ప్రారంభిస్తోంది.. తమ “ట్రూ 5G” గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. 5జీ నెట్‌వర్క్ విస్తృతంగా రెండు మోడ్‌లలో అమలు చేస్తున్నారు.. స్వతంత్ర (ఎస్‌ఏ) మరియు నాన్-స్టాండలోన్ (ఎన్‌సీఏ). ఎన్‌సీఏ నెట్‌వర్క్ ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలపై నిర్మించబడింది, అర్హత ఉన్న సర్కిల్‌లలోని రిలయన్స్ జియో వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో 5జీని ఉచితంగా పరీక్షించవచ్చు. నమోదు చేసుకోవడానికి, వినియోగదారులు “చెల్లుబాటు అయ్యే యాక్టివ్ ప్రీపెయిడ్ (రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్) లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ఉన్నారని నిర్ధారించుకోవాలి. సాధారణంగా, వినియోగదారులు 5జీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే స్వయంచాలకంగా గుర్తించాలి. లేదంటే, యాప్ ఎగువన వెల్‌కమ్ ఆఫర్ కోసం మై జియో యాప్‌ని సందర్శించాలి..