రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిందెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు రూ.10,080 కోట్లు కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.7,032 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.3,048 కోట్ల కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. 2022-23 బడ్జెట్లో గతంతో పోలిస్తే 30 శాతం కేటాయింపులు పెరిగాయన్నారు. 2021-22 బడ్జెట్లో రూ.7,049 కోట్ల కేటాయింపు జరిగాయని తెలిపారు.
ఈ ఏడాది డబ్లింగ్, థర్డ్ లైన్, బై పాస్‌ల కోసం రూ.5,517 కోట్లు కేటాయించగా.. గత ఏడాది రూ.4,238 కోట్లు మాత్రమే కేటాయించిందని వివరించారు. కొత్త లైన్ల కోసం ఈ ఏడాది రూ.2,817 కోట్లు కేటాయించగా.. గత ఏడాది రూ.2,195 కోట్లు కేటాయించిందన్నారు. విద్యుద్దీకరణ కోసం ఈ ఏడాది రూ.791 కోట్లు కేటాయించగా… గత ఏడాది రూ.617 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
కేటాయింపులు:
నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్ రూ.1,051 కోట్లు, కడప-బెంగళూరు కొత్త లైన్ రూ.289 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్ కొత్త లైన్ రూ.358 కోట్లు, మునీరాబాద్-మహబూబ్‌నగర్ కొత్త లైన్ రూ.289 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి కొత్త లైన్ కోసం రూ.163 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త లైన్ కోసం రూ.160 కోట్లు, అక్కన్నపేట-మెదక్ కొత్త లైన్ కోసం రూ.41 కోట్లు, విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం- భీమవరం, నర్సాపూర్- నిడదవోలు డబ్లింగ్, విద్యుద్ధీకరణ కోసం రూ.1,681 కోట్లు, విజయవాడ-గూడూరు 3వ లైన్ కోసం రూ.1000 కోట్లు కేటాయించింది.
గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ పనుల కోసం రూ.803 కోట్లు, కాజీపేట-విజయవాడ థర్డ్ లైన్ కోసం రూ.592.5 కోట్లు, కాజీపేట-బలార్షా మూడో లైన్ కోసం రూ.550.43 కోట్లు, సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ డబ్లింగ్, విద్యుద్ధీకరణ కోసం రూ.150 కోట్లు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్ కోసం రూ.100 కోట్లు, అకోలా-డోన్ డబ్లింగ్ కోసం రూ.5 కోట్లు, బైపాస్ లైన్ల కోసం రూ.407 కోట్లు, మన్మాడ్-డోన్ విద్యుద్దీకరణ కోసం రూ.229 కోట్లు, ధర్మవరం-పాకాల విద్యుద్దీకరణ కోసం రూ.131 కోట్లు, పార్లీ- వైజనాథ్-వికారాబాద్ విద్యుద్దీకరణ కోసం రూ.109 కోట్లు, పూర్ణ-అకోలా విద్యుద్దీకరణ కోసం రూ.103 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్ల విద్యుద్దీకరణ కోసం రూ.51 కోట్లు, లింగంపేట-జగిత్యాల-నిజామాబాద్ విద్యుద్దీకరణ కోసం రూ.39 కోట్లు కేటాయించింది. అటు రైల్వేస్టేషన్ల అభివృద్ధి కోసం రూ.325 కోట్లు కేటాయించగా… చర్లపల్లి శాటిలైట్ టర్మినల్ కోసం రూ.70 కోట్లు, కర్నూలులో మెడిలైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీ కోసం రూ.58 కోట్లు, తిరుపతి రైల్వేస్టేషన్లో సౌత్ సైడ్ ఎంట్రీ కోసం రూ.3 కోట్ల నిధులను రైల్వేశాఖ కేటాయించింది.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!